కర్నూలులో కరోనా మరింత తీవ్రం… ఏపీ @ 1403

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. గత వారం రోజులుగా కరోనా కేసులు 50కి తగ్గకుండా నమోదువుతూ రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 71 మందికి సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 నమోదయ్యాయి. కర్నూలు జిల్లాను కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రమంతా ఒక ఎత్తు కేవలం కర్నూలు జిల్లా ఒక్కటీ ఒక ఎత్తు అనేలా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత […]

Update: 2020-04-30 02:16 GMT

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా తీవ్రత మరింత పెరుగుతోంది. గత వారం రోజులుగా కరోనా కేసులు 50కి తగ్గకుండా నమోదువుతూ రికార్డు దిశగా దూసుకుపోతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 71 మందికి సోకిందని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో ఏపీలో ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1403 నమోదయ్యాయి.

కర్నూలు జిల్లాను కరోనా కేసులు బెంబేలెత్తిస్తున్నాయి. రాష్ట్రమంతా ఒక ఎత్తు కేవలం కర్నూలు జిల్లా ఒక్కటీ ఒక ఎత్తు అనేలా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24గంటల్లో అక్కడ 43 కేసులు నమోదయ్యాయంటే అక్కడ కరోనా తీవ్రత ఏస్థాయిలో ఉందో ఊహించవచ్చు. దీంతో ఆ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 386కి చేరుకుంది. వారిలో 334 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 43 మంది డిశ్చార్జ్ అయ్యారు, 9 మంది మృత్యువాత పడ్డారు.

కృష్ణా జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడి కేసుల సంఖ్య 246కి చేరుకుంది. 206 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 32 మంది డిశ్చార్జ్ అయ్యారు, 8 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదు కావడంతో అక్కడ కేసుల సంఖ్య 287కి చేరుకుంది. అయితే 87 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ కావడంతో 192 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

అనంతపురంలో 3, చిత్తూరులో 3, తూర్పుగోదావరిలో 2, కడపలో 4, నెల్లూరులో 2 కేసులు నమోదయ్యాయని ఏపీ వైద్యఆరోగ్య శాఖ ప్రకటించింది. విజయనగరంలో ఇప్పటివరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కాగా, నిన్న మొత్తం 6,497 మంది శాంపిళ్లను పరీక్షించినట్టు వెల్లడించింది. ఏపీలో మొత్తం కరోనా కేసుల 1,403 కాగా, ఇప్పటివరకు 321 మంది డిశ్చార్జయ్యారని, 31 మంది మరణించారని తెలిపింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 1051 మంది చికిత్స పొందుతున్నారని ప్రకటించింది.

Tags: corona, covid-19, ap, health department

Tags:    

Similar News