గతంలో ఎన్నడూ చూడలేదు : మేయర్
దిశ, వెబ్‌డెస్క్: గతరాత్రి కురిసిన వర్షాలకు హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాలు నీట మునిగాయని జీహెచ్‌ఎంసీ మేయర్ బొంతు రామ్మెహన్ అన్నారు. ఆదివారం ఆయన ఓ మీడియా ఛానెల్‌తో మాట్లాడుతూ… గతంలో ఎన్నడూ లేని విధంగా వర్షాలు పడుతున్నాయని తెలిపారు. దీంతో ఎక్కడ ఏ ప్రమాదం జరుగకుండా జీహెచ్ఎంసీలోని అన్ని శాఖల సిబ్బందిని అలర్ట్ చేశామని వెల్లడించారు. నగరంలో మొత్తం 19 రెస్క్యూ టీములు పనిచేస్తున్నాయని తెలిపారు. అంతేగాకుండా ఇంకా సిబ్బందిని పెంచే అవకాశం ఉందన్నారు.