చిట్యాలలో సిగ్నల్ ప్రాబ్లమ్.. నిలిచిన బ్యాంకు సేవలు
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల యూనియన్ బ్యాంక్‌లో సిగ్నల్స్ సమస్య వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం ఐదురోజులుగా సిగ్నల్స్ లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చిన వారు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క ఏటీఎంలు సైతం పనిచేయకపోవడంతో ఖాతాదారులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి బ్యాంక్ అధికారులు సిగ్నల్ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల రైతులు, ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులు […]
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల యూనియన్ బ్యాంక్‌లో సిగ్నల్స్ సమస్య వల్ల ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం ఐదురోజులుగా సిగ్నల్స్ లేకపోవడంతో లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి బ్యాంకుకు వచ్చిన వారు నిరాశతో వెనుతిరగాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క ఏటీఎంలు సైతం పనిచేయకపోవడంతో ఖాతాదారులు మరింత ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి బ్యాంక్ అధికారులు సిగ్నల్ సమస్యను పట్టించుకోకపోవడం వల్ల రైతులు, ప్రజలు, వ్యాపార సంస్థల యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. సిగ్నల్స్ లేకపోవడంతో వారంలో రెండు రోజులు కూడా తెరుచుకోవడం లేదు. దీంతో ప్రజలు అవసరాల నిమిత్తం ప్రైవేటు వ్యక్తుల వద్ద కమిషన్ చెల్లించి డబ్బులు తీసుకుంటున్నారు. మరి కొంత మంది ఖాతాదారులు అయితే ఏక్షణమైనా బ్యాంకు సేవలు అందుబాటులోకి వస్తాయని బ్యాంకు ముందు రోజుల తరబడి వేచి చూస్తున్నారు. ఇదే విషయంపై బ్యాంక్ మేనేజర్‌ను వివరణ కోరగా నెట్‌వర్క్ లేకపోతే తామేమి చేయలంటూ చెప్పుకొస్తున్నాడు.