భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్న బచ్చన్

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దేశ ప్రజలంతా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలన్న ప్రధానమంత్రి మోడీ పిలుపును దేశవాసులంతా గౌరవించారు. అయితే ఆ సమయంలో నాసా తీసిన భారతదేశ శాటిలైట్ చిత్రం అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బిగ్ బి. కానీ ఆ ఫోటో మీటూ ఉద్యమం సమయంలో ఫార్వార్డ్ అయిన ఫోటో […]

Update: 2020-04-06 01:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ సోషల్ మీడియాలో విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఏప్రిల్ 5న రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు దేశ ప్రజలంతా లైట్లు ఆర్పేసి దీపాలు వెలిగించాలన్న ప్రధానమంత్రి మోడీ పిలుపును దేశవాసులంతా గౌరవించారు. అయితే ఆ సమయంలో నాసా తీసిన భారతదేశ శాటిలైట్ చిత్రం అంటూ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు బిగ్ బి. కానీ ఆ ఫోటో మీటూ ఉద్యమం సమయంలో ఫార్వార్డ్ అయిన ఫోటో షాప్ ఇమేజ్ కావడంతో భారీ ట్రోల్స్ ఎదుర్కొంటున్నారు.

బిగ్ బి తన వల్ల భారతజాతి గర్వపడే స్థాయి నుంచి ఇబ్బంది పడే స్థాయికి దిగజారారని … ఇక రిటైర్మెంట్ తీసుకోవడం మంచిదని కామెంట్ చేశారు. కింగ్ ఆఫ్ ఫేక్ న్యూస్ అంటూ బచ్చన్‌ను విమర్శించిన నెటిజన్లు… ట్విట్టర్ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అలాగైనా మాకు రోజూ టార్చర్ తగ్గుతుందన్నారు. వాట్సప్ యూనివర్సిటీకి కింగ్ అమితాబ్ వాట్సప్ నుంచి తొలిగిపోతే మంచిదని కొందరు వ్యంగ్యంగా మాట్లాడితే… మరికొందరేమో ఈ సమయంలో దేశానికి హ్యాండ్ సానిటైజర్ కన్నా బ్రేయిన్ సానిటైజర్స్ చాలా ముఖ్యమని అమితాబ్‌ను ఉద్దేశించి విమర్శించారు.

బచ్చన్ ఇంతకు ముందు కూడా ఇలాంటి ఫేక్ న్యూస్‌పై ట్రోల్స్ ఎదుర్కున్నారు. కరోనా వైరస్‌పై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసిన బిగ్ బి ప్రశంసలు అందుకున్నా…. జనతా కర్ఫ్యూ రోజున షేర్ చేసిన పోస్ట్ మాత్రం నెటిజన్ల విమర్శలకు కారణమైంది. ఈ రోజు అమావాస్య అని… ప్రజలంతా చప్పట్లు కొట్టడం వల్ల వైరస్ తీవ్రతను తగ్గిస్తుందని తెలుపుతూ ఓ పోస్ట్ పెట్టారు బిగ్ బి. అయితే ఈ థియరీని ఖండించిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో .. ఇలాంటి అసత్య ప్రచారాలు నమ్మొద్దని సూచించింది.

Tags : Amitab Bachan, Big B, Bollywood, CoronaVirus, 9Pm 9Minutes Satellite Image

Tags:    

Similar News