ఏడాది గడిచించి సార్.. డబుల్ డెక్కర్ బస్సుల హామీ మర్చిపోయారా?

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించాలని ట్విట్టర్లో వచ్చిన రిక్వెస్ట్‌లకు మంత్రి కేటీఆర్ గతేడాది నవంబర్ 7న స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని st.george grammar school అబిడ్స్‌లో చదివిన సమయంలో డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తుచేస్తూ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పువ్వాడ.. ఆర్టీసీ ఎండీతో మాట్లాడి త్వరలో డబుల్ డెక్కర్ […]

Update: 2021-11-07 07:09 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లో డబుల్ డెక్కర్ బస్సులను తిరిగి ప్రారంభించాలని ట్విట్టర్లో వచ్చిన రిక్వెస్ట్‌లకు మంత్రి కేటీఆర్ గతేడాది నవంబర్ 7న స్పందించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్‌లోని st.george grammar school అబిడ్స్‌లో చదివిన సమయంలో డబుల్ డెక్కర్ బస్సులో ప్రయాణించిన విషయాన్ని గుర్తుచేస్తూ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్‌ను కోరారు. దీనిపై వెంటనే స్పందించిన పువ్వాడ.. ఆర్టీసీ ఎండీతో మాట్లాడి త్వరలో డబుల్ డెక్కర్ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని ట్వీట్ చేశారు. అయితే ఈ హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా డబుల్ డెక్కర్ బస్సులపై నేటికీ ఎలాంటి నిర్ణయం రాలేదు. దీంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మంత్రి కేటీఆర్ హామీతో హైదరాబాద్‌లో తిరిగి డబుల్ డెక్కర్ బస్సులను చూస్తామనుకున్నారు. అయితే, ఏడాది పూర్తవడంతో మరోసారి గుర్తుచేస్తున్నామంటూ మంత్రి కేటీఆర్, పువ్వాడ అజయ్‌లను ట్యాగ్ చేసి ట్వీట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News