ఒకే ఫ్రేమ్‌లో చాచా చౌదరి, సుప్పండి.. కామిక్ క్యారెక్టర్లకు నెటిజన్లు ఫిదా

దిశ, ఫీచర్స్: బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్(CRED)ను 2018లో స్థాపించారు. కంపెనీ తమ ప్రమోషన్స్‌లో భాగంగా చమత్కారమైన యాడ్స్‌ రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలోనే సదరు యాడ్స్‌లో అనిల్ కపూర్, కుమార్ సాను, రాహుల్ ద్రవిడ్, నీరజ్ చోప్రా వంటి ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఎవరికీ తెలియని కోణాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించింది. ఇక తాజా ప్రకటనలో చాచా చౌదరిని చూపించడంతో ఆ యాడ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. క్రికెట్ అభిమానులకు రాహుల్ ద్రవిడ్‌‌ ఓపిక, మైదానంలో […]

Update: 2021-11-30 09:01 GMT

దిశ, ఫీచర్స్: బెంగళూరుకు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ క్రెడ్(CRED)ను 2018లో స్థాపించారు. కంపెనీ తమ ప్రమోషన్స్‌లో భాగంగా చమత్కారమైన యాడ్స్‌ రూపొందిస్తుంటుంది. ఈ క్రమంలోనే సదరు యాడ్స్‌లో అనిల్ కపూర్, కుమార్ సాను, రాహుల్ ద్రవిడ్, నీరజ్ చోప్రా వంటి ఎంతోమంది సెలబ్రిటీల గురించి ఎవరికీ తెలియని కోణాన్ని హైలైట్ చేయడానికి ప్రయత్నించింది. ఇక తాజా ప్రకటనలో చాచా చౌదరిని చూపించడంతో ఆ యాడ్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది.

క్రికెట్ అభిమానులకు రాహుల్ ద్రవిడ్‌‌ ఓపిక, మైదానంలో తన కూల్ నేచర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి ద్రవిడ్‌ను ‘క్రెడ్’ యాడ్‌లో ఇందిరానగర్ గూండాగా చూపించడంతో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఇది మరవకముందే మరో యాడ్‌లో మనల్ని బాల్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది క్రెడ్. ఈ నేపథ్యంలో మిడిల్ క్లాస్ ఇండియన్ కామిక్ బుక్ క్యారెక్టర్ ‘చాచా చౌదరి’ని మరోసారి తెరమీదకు తీసుకొచ్చింది. కండలవీరుడు కాకపోయినా, సూపర్ పవర్స్ లేకపోయినా అపారమైన తెలివితేటలతో యావత్ కామిక్ ప్రియుల్ని ఆకట్టుకున్న ఈ క్యారెక్టర్ భారతీయులను చాలాకాలం పాటు అలరించింది.

ఇక రామ్ వీర్కర్ రూపొందించిన సుప్పండి సూపర్ క్యారెక్టర్ 1983 నుంచి టింకిల్ కామిక్స్‌లో కనిపిస్తూనే ఉంది. ఆ పాత్ర అజ్ఞాని అయినప్పటికీ.. తన మాస్టర్‌కు విశ్వాసపాత్రంగా ఉండేది. నైంటీస్ కిడ్స్‌కు సుప్పండి, చౌదరి ఇద్దరూ సుపరిచితులే. అలాంటిది వీరిద్దరూ ఒకే తెరమీద కనిపిస్తే.. ఆ మ్యాజిక్‌ వేరే లెవెల్. ఇప్పుడు ఇదే మ్యాజిక్‌‌ను తమ లేటెస్ట్ యాడ్‌లో చూసే అవకాశం కల్పించింది క్రెడ్.

2.46 నిమిషాల నిడివి గల ఈ వీడియో రెండు పాత్రల మధ్య జరిగే సరదా సంభాషణ ద్వారా నేటి ఆర్థిక ప్రపంచంలో మారుతున్న దృశ్యాలను హైలైట్ చేస్తుంది. ఈ యానిమేటెడ్ యాడ్ ఫిల్మ్‌ను ప్రముఖ వెబ్‌కామిక్స్ యానిమేషన్-డిజైన్ కంపెనీ Bakarmax రూపొందించింది. చాచా చౌదరికి నటుడు రఘుబీర్ యాదవ్, సుప్పండికి హాస్యనటుడు సురేష్ మీనన్ గాత్రదానం చేశారు.

Full View

Tags:    

Similar News