శివరాత్రి ఎలా జరుపుకోవాలో నువ్వు చెప్పాలా? సోనుపై నెటిజన్లు ఫైర్

దిశ, సినిమా : లాక్‌డౌన్ హీరో సోనూసూద్‌ను ట్విట్టర్‌లో విలన్‌ను చేసేస్తున్నారు నెటిజన్లు. నువ్వెవరు సోనూసూద్(#WhoTheHellAreUSonuSood )? అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మతం రంగు ఆపాదిస్తూ తిట్టిపోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డైరెక్ట్ విష్ చేయకుండా.. ‘శివుడి ఫోటోను ఫార్వార్డ్ చేయడం ద్వారా కాకుండా, ఒకరికి సాయం చేయడం ద్వారా శివరాత్రిని జరుపుకోండి’ అని ట్వీట్ చేశాడు సోను. కానీ గతంలో ముస్లింల పండుగలకు మాత్రం ‘ఈద్ ముబారక్’ అంటూ […]

Update: 2021-03-11 06:49 GMT

దిశ, సినిమా : లాక్‌డౌన్ హీరో సోనూసూద్‌ను ట్విట్టర్‌లో విలన్‌ను చేసేస్తున్నారు నెటిజన్లు. నువ్వెవరు సోనూసూద్(#WhoTheHellAreUSonuSood )? అంటూ హాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. మతం రంగు ఆపాదిస్తూ తిట్టిపోస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే.. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా డైరెక్ట్ విష్ చేయకుండా.. ‘శివుడి ఫోటోను ఫార్వార్డ్ చేయడం ద్వారా కాకుండా, ఒకరికి సాయం చేయడం ద్వారా శివరాత్రిని జరుపుకోండి’ అని ట్వీట్ చేశాడు సోను. కానీ గతంలో ముస్లింల పండుగలకు మాత్రం ‘ఈద్ ముబారక్’ అంటూ ఎన్నిసార్లు విష్ చేశారో చూడండి అంటూ.. కంపెయిర్ చేస్తూ ట్వీట్స్ చేస్తున్నారు. ‘ప్రతీ ఒక్కరికి హిందువుల పండుగలతోనే ప్రాబ్లమ్.. హోలికి నీళ్లు వేస్ట్ చేయొద్దు, దీపావళికి క్రాకర్స్ పేల్చొద్దు, ఊరేగింపు లేకుండా శ్రీరామ నవమి జరుపుకోవాలని చెప్తుంటారు’ అని మండిపడుతున్నారు. మరి బక్రీద్‌కు ముస్లింలు మేకను బలివ్వకూడదని ఎందుకు చెప్పరని ప్రశ్నిస్తున్నారు. ఎవరి పని వారు చూసుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. కాగా #WhoTheHellAreUSonuSood హాష్‌ట్యాగ్ ట్రెండ్ అయిన వెంటనే సోనూసూద్ శివుడి ఫొటో పోస్ట్ చేసి ‘ఓం నమ:శివాయ’ అని ట్వీట్ చేయడం విశేషం.

Tags:    

Similar News