బాయ్‌కాట్ కరీనా మూవీస్… నెటిజెన్స్
దిశ, వెబ్ డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ నెపోటిజం ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది. “స్టార్స్ పిల్లలు సినిమాల్లోకి రావాలని కోరుకునేది ప్రేక్షకులే. వారిని స్టార్స్‌ను చేసేది ఆడియెన్సే. స్టార్ వారసత్వం వద్దనుకుంటే ప్రేక్షకులు వారి సినిమాలు చూడకపోతే సరిపోతుంది కదా. వారి సినిమాలను రిజెక్ట్ చేస్తే ఒకటి రెండు సినిమాలతోనే వారి కెరీర్ అయిపోతుంది. స్టార్ వారసుల సినిమాలు చూడమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం […]
దిశ, వెబ్ డెస్క్: సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బాలీవుడ్ నెపోటిజం ఆరోపణలు ఎదుర్కుంటోంది. ఈ నేపథ్యంలో కరీనా కపూర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆమెను ఇబ్బందుల్లో పడేసింది.
“స్టార్స్ పిల్లలు సినిమాల్లోకి రావాలని కోరుకునేది ప్రేక్షకులే. వారిని స్టార్స్‌ను చేసేది ఆడియెన్సే. స్టార్ వారసత్వం వద్దనుకుంటే ప్రేక్షకులు వారి సినిమాలు చూడకపోతే సరిపోతుంది కదా. వారి సినిమాలను రిజెక్ట్ చేస్తే ఒకటి రెండు సినిమాలతోనే వారి కెరీర్ అయిపోతుంది. స్టార్ వారసుల సినిమాలు చూడమని మిమ్మల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు కదా” అని ఆ ఇంటర్వ్యూలో కరీనా అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరీనాకు బాగా అహంకారం పెరిగిందంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆమె సినిమాలని బాయ్‌కాట్ చేయాలని పిలుపునిస్తున్నారు. ఆమిర్ ఖాన్‌తో కలిసి కరీనా ప్రస్తుతం 'లాల్ సింగ్ చద్దా' సినిమా చేస్తోంది. దీంతో 'బాయ్‌కాట్ లాల్ సింగ్ చద్దా' అనే హ్యాష్‌ట్యాగ్ ఇప్పుడు ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.