భారత విమానాలకు బ్రేక్ వేసిన నెదర్లాండ్స్

అమస్టర్‌ డామ్: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే అన్ని ప్యాసింజర్ విమానాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నిషేదం సోమవారం నుంచి మే1 వరకు అమలులో ఉంటుందని డచ్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్ నుంచి వెళ్లే కార్గో విమానాలు, మెడికల్ అవసరాల కోసం వినియోగించే విమానాలకు ఈ నిషేదం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు నెదర్లాండ్స్ తెలిపింది. కాగా […]

Update: 2021-04-25 22:00 GMT

అమస్టర్‌ డామ్: భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి నెదర్లాండ్స్ వెళ్లే అన్ని ప్యాసింజర్ విమానాలపై ప్రభుత్వం నిషేదం విధించింది. ఈ నిషేదం సోమవారం నుంచి మే1 వరకు అమలులో ఉంటుందని డచ్ ఏవియేషన్ మినిస్ట్రీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే భారత్ నుంచి వెళ్లే కార్గో విమానాలు, మెడికల్ అవసరాల కోసం వినియోగించే విమానాలకు ఈ నిషేదం నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు నెదర్లాండ్స్ తెలిపింది. కాగా పబ్లిక్ హెల్త్ ఏజెన్సీ ఆర్ఐవీఎమ్ సలహామేరకు నెదర్లాండ్స్ కెబినేట్ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ మేరకు ఆదివారం అర్థరాత్రి నిషేదంపై ప్రకటన చేసింది.

Tags:    

Similar News