నెట్‌ఫ్లిక్స్‌లో కిడ్స్ కోసం న్యూ ఫీచర్స్

దిశ, ఫీచర్స్ : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. రెండు కిడ్స్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘కిడ్స్ టాప్ 10తో పాటు కిడ్స్ రీక్యాప్ ఇమెయిల్’ ఫీచర్స్‌ శుక్రవారం (జులై 11న) నుంచి నెట్‌ఫ్లిక్స్ యూజర్లందరికీ అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. తమ ఖాతాల్లో యాక్టివ్ కిడ్స్ ప్రొఫైల్ సెటప్ ఉన్న మెంబర్స్ అందరికీ ‘కిడ్స్ రీక్యాప్ మెయిల్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా, ‘కిడ్స్ టాప్ 10’ ఫీచర్ 93 దేశాల్లోని డివైసెస్(యాపిల్ టీవీ మినహా)లో […]

Update: 2021-07-15 09:49 GMT

దిశ, ఫీచర్స్ : ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్.. రెండు కిడ్స్ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ను లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘కిడ్స్ టాప్ 10తో పాటు కిడ్స్ రీక్యాప్ ఇమెయిల్’ ఫీచర్స్‌ శుక్రవారం (జులై 11న) నుంచి నెట్‌ఫ్లిక్స్ యూజర్లందరికీ అందుబాటులో ఉండనున్నాయని తెలిపింది. తమ ఖాతాల్లో యాక్టివ్ కిడ్స్ ప్రొఫైల్ సెటప్ ఉన్న మెంబర్స్ అందరికీ ‘కిడ్స్ రీక్యాప్ మెయిల్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుండగా, ‘కిడ్స్ టాప్ 10’ ఫీచర్ 93 దేశాల్లోని డివైసెస్(యాపిల్ టీవీ మినహా)లో రిలీజ్ కానుంది.

‘పిల్లలకు కొత్త ప్రదేశాల గురించి తెలియజేయడం, ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో బాండింగ్ క్రియేట్ చేయడంతో పాటు ఇతరత్రా దృక్పథాలను అర్థం చేయించడంలో ఈ ఫీచర్స్ ఉపయోగపడనుండగా.. ఫ్యామిలీస్ తమ పిల్లలను అభిమాన సిరీస్, మూవీస్‌తో కనెక్ట్ చేసేందుకు లేదా అలాంటి సినిమాలు వెతికిపెట్టేందుకు వీలుగా మేము రెండు కొత్త ఫీచర్స్ ప్రారంభిస్తున్నాం’ అని నెట్‌ఫ్లిక్స్ ప్రొడక్ట్ ఇన్నోవేషన్ డైరెక్టర్ జెన్నీఫర్ నివియా బ్లాగ్ పోస్టులో తెలిపారు.

ఇందులోని మొదటి ఫీచర్ ‘కిడ్స్ రీక్యాప్ ఇమెయిల్’ విషయానికొస్తే.. కంటెంట్ విషయంలో పిల్లల ప్రిఫరెన్స్‌లను సరిగ్గా అర్థం చేసుకునేందుకు వీలుగా పేరెంట్స్‌కు వారం వారం ఇమెయిల్స్ అందుతాయి. ఫేవరెట్ షోస్, మూవీస్‌తో చిల్డ్రన్ ఎంజాయ్ చేస్తున్న ఇతరత్రా అంశాల రికమెండేషన్స్‌తో పాటు నెట్‌ఫ్లిక్స్‌లో కిడ్స్ ఫీచర్‌ను ఉపయోగించడంపై సలహాలు కూడా పంపిస్తుంది. ఇక రెండో ఫీచర్ ‘కిడ్స్ టాప్ 10’.. పిల్లలు స్వంతంగా తమకు నచ్చిన కంటెంట్ వెతకడంలో సాయపడుతుంది. ఇందులో వారి మెచ్యూరిటీ రేటింగ్‌ ఆధారంగా షోస్, సినిమాలు సహా పాపులర్ చిల్డ్రన్ కంటెంట్‌ను రోజువారిగా అప్‌డేట్ చేస్తుంది.

Tags:    

Similar News