నెస్లె ఇండియా నికర లాభం రూ. రూ. 587 కోట్లు
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నెస్లె ఇండియా(Nestle India) నికర లాభం రూ. 1.37 శాతం క్షీణించి రూ. 587.09 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 595.70 కోట్లను ఆర్జించింది. ఈక్విటీ షేర్‌కు రూ. 135 మధ్యంతర డివిడెండ్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.1 శాతం పెరిగి రూ. 3,541.70 కోట్లకు చేరుకుంది. దేశీయ అమ్మకాలు 10.2 శాతం, ఎగుమతులు […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నెస్లె ఇండియా(Nestle India) నికర లాభం రూ. 1.37 శాతం క్షీణించి రూ. 587.09 కోట్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 595.70 కోట్లను ఆర్జించింది. ఈక్విటీ షేర్‌కు రూ. 135 మధ్యంతర డివిడెండ్‌కు కంపెనీ బోర్డు ఆమోదం తెలిపింది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 10.1 శాతం పెరిగి రూ. 3,541.70 కోట్లకు చేరుకుంది.
దేశీయ అమ్మకాలు 10.2 శాతం, ఎగుమతులు 9.4 శాతం వృద్ధి సాధించాయని రెగ్యులేటరీ ఫైలింగ్(Regulatory Filing)లో పేర్కొంది. కరోనాను అధిగమించి కర్మాగారాలు సాధారణ స్థాయికి చేరుకోవడంతో ఈ త్రైమాసికంలో వృద్ధి సాధించామని నెస్లె ఇండియా ఛైర్మన్, ఎండీ సురేష్ నారాయణన్ చెప్పారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో కంపెనీ షేర్ ధర 0.30 శాతం క్షీణించి రూ. 15,863 వద్ద ముగిశాయి.