భారత్‌పై నేపాల్ పీఎం ఆరోపణలు
న్యూఢిల్లీ: ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన భారత్‌పై ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నదని, నేపాల్‌లోని భారత దౌత్యకార్యాలయమూ ఇందులో కీలకంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. అయితే తనను ప్రధాని పదవిని తొలగించడం అసాధ్యమని అన్నారు. నేపాల్ జాతి అంత బలహీనంగా లేదని, కేవలం ఒక మ్యాప్ ప్రింట్ చేసినందుకు ప్రధాని తొలగించవచ్చునని ఒక్కరు కూడా అనుకోబోరని తెలిపారు. భారత భూభాగాలను కలుపుకున్నట్టు […]
న్యూఢిల్లీ: ప్రధాని కేపీ శర్మ ఓలి రాజీనామా చేయాలని నేపాల్ కమ్యూనిస్టు పార్టీలో డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఆయన భారత్‌పై ఆరోపణలు చేశారు. తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్రలు చేస్తున్నదని, నేపాల్‌లోని భారత దౌత్యకార్యాలయమూ ఇందులో కీలకంగా పనిచేస్తున్నదని ఆరోపించారు. అయితే తనను ప్రధాని పదవిని తొలగించడం అసాధ్యమని అన్నారు. నేపాల్ జాతి అంత బలహీనంగా లేదని, కేవలం ఒక మ్యాప్ ప్రింట్ చేసినందుకు ప్రధాని తొలగించవచ్చునని ఒక్కరు కూడా అనుకోబోరని తెలిపారు. భారత భూభాగాలను కలుపుకున్నట్టు చిత్రించిన నేపాల్ రాజకీయ చిత్రపటం కోసం ఆ దేశ ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసిన సంగతి తెలిసిందే.