COVID: కొవిడ్‌కు చెక్ పెడుతున్న ‘నెల్లూరు ఆనందయ్య ఆయుర్వేద వైద్యం’

దిశ, ఏపీ బ్యూరో: ఆనందయ్య ఉచిత ఆయుర్వేద వైద్యం కోవిడ్​వైరస్‌కు శరాఘాతమైంది. కోవిడ్ వ్యాపారులను గంగవెర్రులెత్తిస్తోంది. డ్రగ్​మాఫియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా పాజిటివ్​వచ్చిన వాళ్లకు మందు తీసుకున్నాక రెండు రోజుల్లో నెగటివ్​రిపోర్టు వచ్చేస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లకు ఆక్సిజన్‌తో పనిలేకుండా పోతోంది. కరోనాతో ఏర్పడిన జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులన్నీ మటుమాయమవుతున్నాయి. సిటీ స్కాన్​లో చెస్ట్​సివేరిటీ 24/25 ఉన్నవాళ్లకు సైతం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాకు ఉచిత మందు గురించి ఆనోటా ఈనోటా ఇరుగుపొరుగు రాష్ర్టాలకూ చేరింది. […]

Update: 2021-05-20 00:56 GMT

దిశ, ఏపీ బ్యూరో: ఆనందయ్య ఉచిత ఆయుర్వేద వైద్యం కోవిడ్​వైరస్‌కు శరాఘాతమైంది. కోవిడ్ వ్యాపారులను గంగవెర్రులెత్తిస్తోంది. డ్రగ్​మాఫియాలో ప్రకంపనలు పుట్టిస్తోంది. కరోనా పాజిటివ్​వచ్చిన వాళ్లకు మందు తీసుకున్నాక రెండు రోజుల్లో నెగటివ్​రిపోర్టు వచ్చేస్తోంది. శ్వాస తీసుకోవడం కష్టమైన వాళ్లకు ఆక్సిజన్‌తో పనిలేకుండా పోతోంది. కరోనాతో ఏర్పడిన జ్వరం, దగ్గు, ఒళ్లునొప్పులన్నీ మటుమాయమవుతున్నాయి. సిటీ స్కాన్​లో చెస్ట్​సివేరిటీ 24/25 ఉన్నవాళ్లకు సైతం సాధారణ స్థితికి చేరుకుంటోంది. కరోనాకు ఉచిత మందు గురించి ఆనోటా ఈనోటా ఇరుగుపొరుగు రాష్ర్టాలకూ చేరింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని కృష్ణపట్నం అనే ఓ గ్రామం నెటిజన్ల పుణ్యమా అని ప్రపంచ చిత్రపటంలో కెక్కింది. కరోనాను పారదోలుతున్న ఈ ఆనందయ్య ఎవరు.. కరోనా నివారణకు ఏం మందు ఇస్తున్నారనేది పరిశీలిస్తే..

బొనిగే ఆనందయ్య గొలగమూడి వెంకయ్య స్వామి భక్తుడు. కరోనా మొదటివేవ్​సమయంలో తమిళనాడుకు చెందిన ఓ ఆయుర్వేద వైద్యుడి సూచనల మేరకు మందు తయారు చేసి తనపైనే ప్రయోగం చేసుకున్నాడు. కోవిడ్ పారిపోయింది. తర్వాత తమ కుటుంబ సభ్యులపై ప్రయోగించాడు. వాళ్లకూ ఉపశమనం లభించింది. దీంతో రెండో వేవ్‌లో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆయర్వేద మూలికలతో మందును తయారు చేశాడు. ప్రజలకు ఉచితంగా పంపిణీ మొదలు పెట్టాడు. కరోనాతో అత్యవసర పరిస్థితుల్లోనూ రోగి ఈ మందుతో తెప్పరిల్లుకుంటున్నాడు. స్వయంగా కరోనా బాధితులు తమ అనుభవాలు తెలియజేశారు. దీంతో కృష్ణపట్నం కరోనా ఫ్రీ గ్రామంగా మారిపోయింది. ఉచితంగా ఇచ్చే మందు కోసం కేరళ, కర్నాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున గ్రామానికి తరలి వస్తున్నారు. క్యూలు పెరుగుతున్నాయి. జనాన్ని అదుపు చేయడం ప్రభుత్వ యంత్రాంగం వల్ల కావడం లేదు. ఇదే సమయంలో ఎలాంటి శాస్ర్తీయ పరీక్షలు చేయకుండా కరోనాకు మందు ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆయనపై లోకాయుక్తకు ఫిర్యాదులు అందాయి. దీనిపై కలెక్టరు చక్రధర్​బాబు రంగంలోకి దిగారు. ఆయుష్​శాఖ వైద్యులతో ఆనందయ్య ఇస్తున్న మందును పరిశీలించారు. పరీక్షల నిమిత్తం నమూనాలను ల్యాబొరేటరీకి పంపారు. మందు తీసుకున్న కరోనా బాధితులను వాకబు చేశారు. ఎవరికీ ఎలాంటి సైడ్​ఎఫెక్ట్స్​ లేవని నిర్ధారించారు. పైగా తమకు కరోనా నుంచి ఉపశమనం లభించినట్లు బాధితులు తెలిపారు. అయినా సరే జనం భౌతిక దూరం పాటించడం లేదంటూ ఆనందయ్య ఇస్తున్న ఉచిత ఆయుర్వేద మందును బలవంతంగా నిలిపేయించారు. మందుపై పరీక్ష ఫలితాలు వచ్చే దాకా పంపిణీ చేయడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు.

ఇంతకీ ఆనందయ్య ఇస్తున్న మందులో ఏముందంటే..

ఆనందయ్య ఉచితంగా ఇస్తున్న ఆయర్వేద మందు మనచుట్టూ లభించే మూలికలతో తయారయ్యేదే. పటిక బెల్లం, పచ్చ కర్పూరం, మిరియాలు, ధనియాలు, పసుపు, తేనెతోపాటు మరికొన్ని పదార్థాల మిశ్రమంతో తయారు చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 30 వేల మందికి ఉచితంగా ఈ మందును పంపిణీ చేశారు. ఇందుకోసం ఆనందయ్యకు స్నేహితులు అండగా నిలిచారు. కృష్ణ పట్నం గ్రామ జనాభా సుమారు 11 వేలుంటుంది. వీళ్లంతా మందు తీసుకున్నారు. ఒక్కరికీ కరోనా సోకలేదు. ఈపాటికే పాజిటివ్​లక్షణాలు ఉన్నవాళ్లు మందుతో వేగంగా కోలుకున్నారు. ఈ మూలికలతో చేసిన మందును తీసుకోవడం ద్వారా సైడ్​ఎఫెక్ట్స్​ఏమీ ఉండవని ఆయుర్వేద వైద్యులు సైతం నిర్ధారిస్తున్నారు. ఓ కరోనా బాధితుడు ప్రాణాపాయస్థితిలో ఉన్పప్పుడు ఈ మందు తగ్గిస్తుందా లేదా అనే నిర్ధారణ కావాల్సి ఉంది. లేకుంటే ఇది మరో వివాదానికి దారితీసే అవకాశాలున్నాయి.

వేపమందు సామెతే..

ఒకనానొకప్పుడు ఆటలమ్మ(చికెన్​ఫాక్స్) సోకితే వేపాకుల రసం పూస్తే తగ్గిపోయేది. నాడు దీన్ని అల్లోపతి వైద్యులు మూర్ఖత్వంగా కొట్టిపారేశారు. తర్వాత క్రమేణా వేపలో ఉండే అజాడిరక్టిన్​ వైరస్​ను పారదోలుతుందని తెలిసే సరికి వేప చెట్లు, వేప ఉత్పత్తులపై అమెరికాకు చెందిన కంపెనీలు పేటెంటు పొందాయి. అలాగే పసుపు మీద కూడా వాళ్లు పేటెంట్​రైట్స్​కు వెళ్లారు. సమశీతోష్ణస్థితి కలిగిన మనదేశంలో అనేక మొక్కలు, మూలికలు ప్రజలకు తెలియకుండానే వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ఇప్పుడు బహుళజాతి కంపెనీలు వీటిపై పరిశోధనలు చేసి మేథోపరమైన హక్కులను పొందుతున్నాయి. వాణిజ్య సరకుగా మలుచుకుంటున్నాయి. అందుకే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి సహజసిద్దమైన ప్రాచీన ఆయర్వేద వైద్యంపై పరిశోధనలకు ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వలేదు. డ్రగ్​మాఫియా గుప్పెట్లోనే భారత ప్రజల ఆరోగ్యం ఇమిడి ఉంది. ఈ ఒరవడి ఇంకా కొనసాగుతూనే ఉంది. వలస భావజాలాన్ని నింపుకున్న మన పాలక ప్రభుత్వాలు ఇంకా ప్రపంచ ఫార్మా కంపెనీల గుత్తాధిపత్యానికి ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడుతున్నాయి.

నేడు ఆనందయ్య తయారు చేసి ఉచితంగా అందజేస్తోన్న కరోనా మందు ఏ పతంజలినో తయారు చేస్తే పాలక ప్రభుత్వాలు ఇలాగే స్పందించేవా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్​ఆస్పత్రులు, డ్రగ్​కంపెనీల నీడలో ఉండే ప్రభుత్వాలు ఆనందయ్య ఆయర్వేద మందుకు అనుమతులు ఇవ్వవంటూ గగ్గోలు పెడుతున్నారు. ఈలోగా ఆవు పేడ కరోనాకు విరుగుడంటూ ప్రచారం చేసిన వాళ్లను ఆనందయ్య మందుతో కలిపి కొందరు ప్రచారం చేస్తున్నారు. హిందుత్వానికి లింకుపెట్టి ఆనందయ్యకు మద్దతు తెలుపుతున్నారు. ఇక్కడ కూడా మత కోణాన్ని జొప్పించే ప్రయత్నం కొందరు చేస్తుంటే.. దాన్ని అనుకూలంగా మల్చుకోవడానికి డ్రగ్​మాఫియా రంగంలోకి దిగింది. ఆనందయ్య మందు కూడా ఆవుపేడ, కల్వరి నూనెలాంటిదేనని ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దీనిపై సీరియస్​గా తీసుకోవాలి. గతంలో ఎన్నో వైరస్​ల మూలాలను భారతీయ ఆయుర్వేద వైద్యం ఛేదించిన చరిత్ర ఉంది. ఆ దిశగా కరోనాకు ప్రత్యామ్నాయ మందు లేదా వైద్యాన్ని ముందుకు తెచ్చిన ఆనందయ్య ప్రయత్నానికి ప్రభుత్వం అండగా నిలవాలి. అవసరమైతే మరిన్ని పరిశోధనలు చేసి భారతీయ ఆయర్వేద వైద్యం గొప్పదనాన్ని నిలబెట్టాలి.

Tags:    

Similar News