ధోనీని తిట్టి తప్పు చేశా : ఆశిష్ నెహ్రా
టీం ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది.. వికెట్ తీసినప్పుడు అతడు ‘పక్షిలా’ చేసుకునే సెలబ్రేషనే. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఈ సీనియర్ క్రికెటర్.. ఓసారి మాత్రం సహనం కోల్పోయి వికెట్ కీపర్ ధోనీపై నోరు పారేసుకున్నానడట. 2005లో పాకిస్తాన్ పర్యటనలో చోటుచేసున్న సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకున్నాడు. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో ధోనీపై నెహ్రా ఫైర్ అయ్యాడు. నెహ్రా వేసిన బంతిని […]
టీం ఇండియా మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా అంటే అందరికీ టక్కున గుర్తుకు వచ్చేది.. వికెట్ తీసినప్పుడు అతడు ‘పక్షిలా’ చేసుకునే సెలబ్రేషనే. ఎప్పుడూ కూల్‌గా కనిపించే ఈ సీనియర్ క్రికెటర్.. ఓసారి మాత్రం సహనం కోల్పోయి వికెట్ కీపర్ ధోనీపై నోరు పారేసుకున్నానడట. 2005లో పాకిస్తాన్ పర్యటనలో చోటుచేసున్న సంఘటనను ప్రస్తుతం గుర్తు చేసుకున్నాడు. ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన నాలుగో వన్డేలో ధోనీపై నెహ్రా ఫైర్ అయ్యాడు. నెహ్రా వేసిన బంతిని షాహిద్ అఫ్రీదీ షాట్ ఆడగా.. అది కాస్తా ఎడ్జ్ తీసుకుంది. కాగా, ధోనీ ఆ క్యాచ్ అందుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన నెహ్రా అక్కడే తిట్టేశాడు. అతని తిట్లు స్టంప్ మైకుల ద్వారా స్పష్టంగా వినిపిందింది. అయితే నెహ్రాకు అంత కోపం రావడానికీ కారణం లేకపోలేదు. అఫ్రీదీ అంతకు ముందు బంతినే సిక్సు బాదాడు, ఆ తర్వాతి బంతికే అవుటయ్యే ఛాన్స్‌ను ధోనీ, ద్రావిడ్ కలిసి వదిలేయడంతో నెహ్రా కోపంతో ఊగిపోయాడు.
అయితే, ‘తాను ఆ రోజు అలా స్పందించకుండా ఉండాల్సింది. ఏ క్రికెటర్ అయినా అప్పుడు అలాగే ప్రవర్తిస్తాడని’ అన్నాడు. ఈ ఘటన అనంతరం ధోనీ, ద్రవిడ్ ఇద్దరూ తనతో మామూలుగానే ఉన్నారని, కానీ నేనే చాలా బాధపడ్డానని, మొత్తానికి నేను ఆ రోజు ధోనీని తిట్టడం తప్పే’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
Tags: Ashish Nehra, MS Dhoni, PAkistan Tour, Catch Miss, Afridi