మంత్రి మల్లారెడ్డి చిన్నచూపు

దిశ ప్రతినిధి, మేడ్చల్ : రైతు వేదికల నిర్మాణ పనులు నత్త నడకన తలపిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. దసరా పండుగలోపు పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు భేఖతరయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే 9 వేదికలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలో కనిపించిన హడావిడి నిర్మాణ పనుల్లో కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ కాంట్రాక్ట్ పనులను టీఆర్ఎస్ నేతలకే కట్టబెట్టడంతో వారిని అడిగే దిక్కే లేకుండా పోయింది. […]

Update: 2020-11-04 02:24 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్ : రైతు వేదికల నిర్మాణ పనులు నత్త నడకన తలపిస్తున్నాయి. నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. దసరా పండుగలోపు పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలు భేఖతరయ్యాయి. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే 9 వేదికలకు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలో కనిపించిన హడావిడి నిర్మాణ పనుల్లో కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. నిర్మాణ కాంట్రాక్ట్ పనులను టీఆర్ఎస్ నేతలకే కట్టబెట్టడంతో వారిని అడిగే దిక్కే లేకుండా పోయింది. దీనికితోడు మంత్రి మల్లారెడ్డి పనలను పట్టించుకోకపోవడంతోనే కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

నిర్మాణ పనుల్లో జాప్యం…

మేడ్చల్ నియోజకవర్గంలోని కీసర, యాద్గార్ పల్లి, ప్రతాపసింగారం, ఏదులాబాద్, రాయిలాపూర్, పూడురు, అలియాబాద్, లాల్ గడి మలక్ పేట్, మూడు చింతలపల్లిలో భవనాలకు శ్రీకారం చుట్టారు. ఒక్కోదాన్ని రూ.22లక్షల వ్యయం చొప్పున రూ.1.98కోట్లు నిధులు మంజూరయ్యాయి. వీటిలో నాలుగింటిని కీసర, యాద్గార్ పల్లి, ప్రతాప్ సింగారం, ఏదులాబాద్ పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్మింస్తుండగా, 3 వేదికల పనులు 95శాతం పూర్తి కాగా, ఏదులాబాద్ లో రైతు వేదికను మంగళవారం మంత్రి ప్రారంభించారు. మిగిలిన ఐదు వేదికలను రోడ్లు భవనాలు ఆర్ అండ్ బీ శాఖ నిర్మిస్తోంది.

ప్రతాప సింగారం, అలియాబాద్, పూడురు, లాల్ గడి మలక్ పేట రాయిలాపూర్ లోని భవనాల పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటుంది. అయితే ఆర్ అండ్ బీ అధికారుల పర్యవేక్షణ లోపం, టీఆర్ఎస్ నేతలు నిర్మిస్తుండడం వల్లనే నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందని రైతులు ఆరోపిస్తున్నారు. అయితే కలెక్టర్ వెంకటేశ్వర్లు రెండుసార్లు వేదికల నిర్మాణ పనులను పరిశీలించి, వేగవంతం చేయాలని నిర్మాణదారులను ఆదేశించారు. కానీ మంత్రి మల్లారెడ్డి మాత్రం ఒక్కసారి కూడా వీటి పురగోతిపై సమీక్షించిన దాఖాలల్లేవని ఆగ్రహం రైతులు వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News