ఆయన కారణంగానే ప్రమోషన్లలో నిర్లక్ష్యం
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తిచేయాలని సీం కేసీఆర్ ఆదేశించినా వైద్య విధాన పరిషత్‌లో మాత్రం ఈ ప్రక్రియ తూతూ మంత్రంగానే సాగుతోంది. కమ్యూనిటీ ఆస్పత్రులు మొదలు జిల్లా ఆసుపత్రి వరకు వివిధ కేడర్‌లలో ఉన్న చాలా మంది ఉద్యోగులు ప్రమోషన్స్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ విభాగానికి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో వైద్య విద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి […]
దిశ, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో ప్రమోషన్ల ప్రక్రియను జనవరి 31 లోగా పూర్తిచేయాలని సీం కేసీఆర్ ఆదేశించినా వైద్య విధాన పరిషత్‌లో మాత్రం ఈ ప్రక్రియ తూతూ మంత్రంగానే సాగుతోంది. కమ్యూనిటీ ఆస్పత్రులు మొదలు జిల్లా ఆసుపత్రి వరకు వివిధ కేడర్‌లలో ఉన్న చాలా మంది ఉద్యోగులు ప్రమోషన్స్‌పై అనేక ఆశలు పెట్టుకున్నారు. కానీ ఈ విభాగానికి పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో వైద్య విద్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ రెడ్డి ఇన్‌ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఆయన కారణంగానే ప్రమోషన్ల ప్రక్రియ ఇన్ టైంలో జరగడంలేదని సిబ్బంది ఆరోపిస్తున్నారు.
పేద రోగులకు వైద్య సేవలు అందించటంలో జాతీయ స్థాయిలోనే గుర్తింపు తెచ్చుకున్న వైద్య విధాన పరిషత్ ఉద్యోగులు ప్రమోషన్‌కు నోచుకోవడంలేదు. ప్రమోషన్లపై కేసీఆర్ ప్రకటించినా ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. ప్రమోషన్లు ఇవ్వడానికి అర్హులైన వారితో సీనియారిటీ ప్రకారం జాబితాను రూపొందించినా కోర్టు కేసులను బూచిగా చూపి డీఎంఈ జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒక్క చోట బ్రేక్ వేయడంతో దానికి లింకుగా ఉన్న ప్రమోషన్లన్లీ ఆపేస్తున్నారని వాపోతున్నారు. డాక్టర్లు, నర్సులతో పాటు ఇతర క్యాడర్‌లో ఉన్న ఉద్యోగులు ప్రమోషన్ల విషయంలో ప్రక్రియను ప్రారంభించకుండా కాలయాపన చేస్తున్నారని ఉద్యోగ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ధైర్యం చేసి ఎవరైనా బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తే వారిపై కక్షసాధింపు చర్యలు షరా మామూలే అని, అందుకే పేర్లు చెప్పడానికి సైతం తమకు ధైర్యం లేదని ఉద్యోగ సంఘాల నేతలు తమ నిస్సహాయతను వ్యక్తం చేశారు.
పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో..
వైద్య విధాన పరిషత్‌లో పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం, సమర్ధవంతంగా పనిచేసే అధికారులు లేకపోవడంతో విధాన పరిషత్‌లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని చెబుతున్నారు. అసిస్టెండ్ డైరెక్టర్ హోదాకు ప్రమోషన్ పొందడానికి ఐదుగురు, అడ్మిస్ట్రేటివ్ ఆఫీసర్ స్థాయికి 45 మంది, సూపరింటెండెంట్‌ల స్థాయికి 35 మంది, సీనియర్ అసిస్టెంట్ స్థాయికి 40 మంది, జూనియర్ అసిస్టెంట్ స్థాయికి 44 మంది, స్టాఫ్ నర్సు మొదలు గ్రేడ్ వన్ వరకు 565 మంది ప్రమోషన్స్ పొందడానికి అర్హులని తేలింది. కానీ, ఒక్క పోస్టు వివాదం కావడంతో దాన్ని కింది స్థాయి ప్రమోషన్లకు ముడిపెడుతున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వివాదాల కారణంగానే పూర్తికాలేదు – డీఎంఈ (ఇన్‌ఛార్జి కమిషనర్, వైద్య విధాన పరిషత్)
కోర్టు కేసులతో పాటు వివిధ రకాల వివాదాలు ఉన్నందునే పూర్తి స్థాయిలో ప్రమోషన్స్ చేపట్టేలకపోయాం. సమస్యలు లేని చోట ప్రక్రియ సజావుగానే జరుగుతోంది. ఇప్పటివరకు ఎన్ని పోస్టులకు ప్రమోషన్స్ కల్పించామనేది స్పష్టంగా చెప్పలేను. అన్నీ అనుకున్నట్లుగా కావు గదా! కొన్నింటి దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి ఉన్న చోట ఆలస్యమవుతోంది.