ఈ నెల 23న నెఫ్ట్ సేవలకు అంతరాయం : ఆర్‌బీఐ!

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీల కోసం వినియోగించే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలు ఈ నెల 23న కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం వెల్లడించింది. రాబోయే ఆదివారం 14 గంటలు నెఫ్ట్ సేవల్లో అంతరాయం ఉంటుందని, సాంకేతిక కారణాల వల్లనే తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆర్‌బీఐ వివరించింది. “నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు 22న కార్యకలాపాలు ముగిసిన అనంతరం నెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ జరుగుతుంది. దీనివల్ల 23న అర్ధరాత్రి 12 […]

Update: 2021-05-17 04:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఆన్‌లైన్ లావాదేవీల కోసం వినియోగించే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్‌ఫర్(నెఫ్ట్) సేవలు ఈ నెల 23న కొన్ని గంటల పాటు నిలిచిపోనున్నట్టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) సోమవారం వెల్లడించింది. రాబోయే ఆదివారం 14 గంటలు నెఫ్ట్ సేవల్లో అంతరాయం ఉంటుందని, సాంకేతిక కారణాల వల్లనే తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ఆర్‌బీఐ వివరించింది. “నెఫ్ట్ పనితీరును మరింత మెరుగుపరిచేందుకు 22న కార్యకలాపాలు ముగిసిన అనంతరం నెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడ్ జరుగుతుంది. దీనివల్ల 23న అర్ధరాత్రి 12 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెఫ్ట్ సేవలు పనిచేయవు. ఆర్‌టీజీఎస్ సేవలు మాత్రమే యథాతథంగా కొనసాగనున్నట్టు” ఆర్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి సంబంధిత బ్యాంకులు తమ వినియోగదారులకు సమాచారాన్ని అందిస్తాయని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. 2019 డిసెంబర్ నుంచి నెఫ్ట్ సేవలను 24 గంటల పాటు అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News