మందుబాబులకు షాక్.. ఆ రెండు ఉంటేనే మద్యం
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం ప్రియులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. ఇకపై మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఉంటేనే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యానికి బానిసైన వారు మద్యం సేవించకుండా ఉండలేరు. అంతే కాకుండా వారు ఎక్కడ మద్యం దుకాణం కనిపిస్తే అక్కడికి వెళ్లి మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. అందువలన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు […]
దిశ, వెబ్‌డెస్క్ : మద్యం ప్రియులకు తమిళనాడు సర్కార్ షాకిచ్చింది. ఇకపై మద్యం దుకాణాల్లో మద్యం కొనుగోలు చేయాలంటే వ్యాక్సిన్ వేసుకున్నట్టుగా సర్టిఫికెట్, ఆధార్ కార్డు ఉంటేనే మద్యం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మద్యానికి బానిసైన వారు మద్యం సేవించకుండా ఉండలేరు. అంతే కాకుండా వారు ఎక్కడ మద్యం దుకాణం కనిపిస్తే అక్కడికి వెళ్లి మద్యం సేవిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారికి కరోనా సోకే ప్రమాదం ఉంది. అందువలన వారి నుంచి వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకకూడదని, కరోనా నియంత్రిచడానికి అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఇది నీలగిరి జిల్లాలో మాత్రమే అమలవుతోంది. అక్కడ మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ తప్పనిసరి చేశారు అధికారులు.
తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్న మహిళ.. వైద్యపరీక్షతో షాకైన భర్తలు
కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి విలువైన మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. ఇక, ఆ ప్రాంతంలో 18 ఏళ్లకు పైబడినవారు 5.82 లక్షల మంది ఉండగా.. ఇప్పటికే 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. అయితే మిగితా వారు వ్యాక్సిన్ తీసుకోవడానికి మొగ్గు చూపేలా.. అలాగే కొందరు మద్యం సేవించే వారు వ్యాక్సిన్ తీసుకోవడాని ఆసక్తి చూపక పోవడంతో, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి మొగ్గుచూపేలా ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది.