మనో వికాస కేంద్రం సేవలు భేష్
దిశ, వరంగల్ : మానసిక వికలాంగుల కోసం గత 20ఏళ్లుగా వరంగల్ నగరంలో మల్లికాంబ మనో వికాస కేంద్రం అందిస్తున్న సేవలు బాగున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మంగళవారం ఆమె మనో వికాస కేంద్రాన్ని సందర్శించారు. డాక్టర్ బండ రామలీల చేస్తున్నసేవలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రామలీల సేవలను గుర్తించి సత్కరించడం గొప్ప విషయమన్నారు. అయితే ఆమె భర్త […]
దిశ, వరంగల్ :
మానసిక వికలాంగుల కోసం గత 20ఏళ్లుగా వరంగల్ నగరంలో మల్లికాంబ మనో వికాస కేంద్రం అందిస్తున్న సేవలు బాగున్నాయని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో మంగళవారం ఆమె మనో వికాస కేంద్రాన్ని సందర్శించారు. డాక్టర్ బండ రామలీల చేస్తున్నసేవలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రామలీల సేవలను గుర్తించి సత్కరించడం గొప్ప విషయమన్నారు. అయితే ఆమె భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించడం పట్ల మంత్రి సంతాపం తెలిపి, కుటుంబ సభ్యులకు సానుభూతి ప్రకటించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆ కేంద్రంలో ఉంటున్నమానసిక వికలాంగులను ఆదుకునేందుకు ప్రభుత్వం తరపున బియ్యం, పప్పులు, నూనెలు వంటి నిత్యావసర సరుకులను మంత్రి అందజేశారు. మల్లికాంబ లాంటి స్వచ్ఛంద సంస్థల వల్ల సమాజంలో మానసిక వికలాంగులకు చాలా మేలు జరిగిందని, ఈ కేంద్రాన్ని మరింత విస్తరించి, ఇంకా చాలామందికి సేవలందించాలని మంత్రి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మంత్రి సత్యవతితో పాటు గిరిజన సంక్షేమ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారులు చెన్నయ్య, సంధ్యారాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags: minister satyavathi, warangal, necesities supply, mano viskasa kendram