ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్..
దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అక్కడకు పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఏండేండ్లుగా పెండింగ్లో ఉన్న దీనిపై ఎట్టకేలకు ఆర్డర్లు జారీ అయ్యాయి. రాష్ట్రంలో నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారిని అక్కడకే పంపించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వచ్చేనెల 15 వరకు ఆ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపుగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులు ఏపీకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే […]
దిశ, తెలంగాణ బ్యూరో : ఏపీలో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తున్న ప్రభుత్వ ఉద్యోగులను అక్కడకు పంపించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపుగా ఏండేండ్లుగా పెండింగ్లో ఉన్న దీనిపై ఎట్టకేలకు ఆర్డర్లు జారీ అయ్యాయి. రాష్ట్రంలో నుంచి ఏపీకి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న వారిని అక్కడకే పంపించేందుకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వచ్చేనెల 15 వరకు ఆ జాబితా సిద్ధం చేయాలని ఆదేశించారు. దాదాపుగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులు ఏపీకి వెళ్లేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే రాష్ట్రం నుంచి ఎన్ఓసీ ఇస్తున్నట్లు ఆదేశాలిచ్చినా.. ఏపీ నుంచి మాత్రం ఎలాంటి నిర్ణయం వెలువడలేదు. ఇప్పుడు ఏపీ సమ్మతి లేకుండా రాష్ట్రం నుంచి రిలీవ్ చేస్తే వారికి వేతనాలు కూడా పెండింగ్లో పడనున్నాయి. దీంతో ఏపీకి వెళ్లే ఉద్యోగులు ఏం చేయాలనే అనిశ్చిత కొనసాగుతోంది.
రాష్ట్ర విభజన అనంతరం కొంతమంది ఏపీకి చెందిన ఉద్యోగులు రాష్ట్రంలో పని చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన ఉద్యోగులు ఏపీలో ఉండగా.. ఆరు నెలల కిందట వారిని రాష్ట్రానికి తీసుకువచ్చారు. రాష్ట్రానికి వచ్చిన వారిని ఆయా శాఖల్లో సర్దుబాటు చేసేందుకు దాదాపు నాలుగు నెలల సమయం తీసుకున్నారు. అదే విధంగా ఇక్కడి నుంచి ఏపీకి వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్న వారిని పంపించేందుకు ప్రభుత్వం ఆదేశాలివ్వలేదు. తాజాగా దీనిపై నిర్ణయం తీసుకుని, వారికి ఎన్ఓసీ జారీ చేయాలని సూచించారు. ఆక్లోబర్ 15 వరకు సంబంధిత ఉద్యోగుల జాబితాను సిద్ధం చేసి ఏపీకి పంపించాలని నిర్ణయించారు. అయితే దీనిపై ఏపీ నుంచి మాత్రం ఇంకా ఉత్తర్వులు రాలేదు. దీంతో వీరు వెళ్లేలా.. వద్దా అనేది ఇంకా సందేహంగానే మారింది.