దీదీ కోసం శరద్ పవార్ ప్రచారం.. ఏప్రిల్ 1న బెంగాల్‌కు
కోల్‌కతా: ఐదు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు కాకమీదకొచ్చాయి. ముఖ్యంగా బెంగాల్‌లో క్యాంపెయిన్‌లూ సెగలు పుట్టిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీకి బాసటగా సీనియర్ లీడర్, ఎన్‌సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ బెంగాల్‌లో ప్రచారం చేయడానికి నిర్ణయించారు. మమతా బెనర్జీకి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారని ఎన్‌సీపీ ప్రతినిధి మహేశ్ తపాసే గురువారం వెల్లడించారు. ఏప్రిల్ 1న బెంగాల్‌కు వెళ్తారని, మూడు రోజులపాటు […]
కోల్‌కతా: ఐదు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాలు కాకమీదకొచ్చాయి. ముఖ్యంగా బెంగాల్‌లో క్యాంపెయిన్‌లూ సెగలు పుట్టిస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు ఢీ అంటే ఢీ అన్నట్టుగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో టీఎంసీకి బాసటగా సీనియర్ లీడర్, ఎన్‌సీపీ చీఫ్, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ బెంగాల్‌లో ప్రచారం చేయడానికి నిర్ణయించారు. మమతా బెనర్జీకి మద్దతుగా ఆయన ప్రచారం చేస్తారని ఎన్‌సీపీ ప్రతినిధి మహేశ్ తపాసే గురువారం వెల్లడించారు. ఏప్రిల్ 1న బెంగాల్‌కు వెళ్తారని, మూడు రోజులపాటు అక్కడే ప్రచారంలో పాల్గొంటారని వివరించారు. ఇప్పటికే బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా టీఎంసీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. బెంగాల్ అసెంబ్లీ 294 స్థానాలకు ఎనిమిది విడతల్లో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 29 వరకు జరగనున్నాయి.