హీరో బాలకృష్ణకు ఆపరేషన్.. విశ్రాంతి తీసుకోవాలన్న డాక్టర్లు
దిశ, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణకు కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు సోమవారం డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా బాలయ్య మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలయ్యకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని వారు చెప్పారు. అయితే ఇక ఇన్నాళ్లు వెండితెరపై వెలుగొందిన బాలయ్య.. ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ […]
దిశ, సినిమా : నందమూరి నటసింహం బాలకృష్ణకు కేర్ హాస్పిటల్లో ఆపరేషన్ జరిగింది. కొంతకాలంగా కుడి భుజం నొప్పితో బాధపడుతున్న ఆయనకు సోమవారం డాక్టర్ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో శస్త్రచికిత్స నిర్వహించారు. కాగా బాలయ్య మంగళవారం సాయంత్రం డిశ్చార్జ్ అయినట్లు డాక్టర్లు తెలిపారు. బాలయ్యకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని వారు చెప్పారు. అయితే ఇక ఇన్నాళ్లు వెండితెరపై వెలుగొందిన బాలయ్య.. ఇప్పుడు హోస్ట్‌గా మారబోతున్న విషయం తెలిసిందే. తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికే ద్వారా ప్రేక్షకులకు తనలోని మరో యాంగిల్ చూపించబోతున్నారు.