నయనతార ‘సీక్రెట్‌’గా కానిచ్చేసిందా?

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. చెన్నైలోని కుమరన్ ఆస్పత్రిలో టీకా తీసుకున్న ఇద్దరి ఫొటోలను శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సంగతి పక్కనబెడితే ముఖ్యంగా వారి చేతికున్న రింగ్స్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇద్దరు ధరించినవి ఒకేలా ఉండటంతో.. అవి నిశ్చితార్థపు ఉంగరాలే అని […]

Update: 2021-05-19 05:39 GMT

దిశ, సినిమా : లేడీ సూపర్ స్టార్ నయనతార, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్‌లు కొవిడ్ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకున్నారు. చెన్నైలోని కుమరన్ ఆస్పత్రిలో టీకా తీసుకున్న ఇద్దరి ఫొటోలను శివన్ తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశాడు. దీంతో ఈ ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ సంగతి పక్కనబెడితే ముఖ్యంగా వారి చేతికున్న రింగ్స్ గురించే సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది. ఇద్దరు ధరించినవి ఒకేలా ఉండటంతో.. అవి నిశ్చితార్థపు ఉంగరాలే అని నెటిజన్లు డిస్కస్ చేస్తున్నారు. ఈ మేరకు ఎంగేజ్‌మెంట్ అయిపోయి ఉంటుందని, పెళ్లి కూడా త్వరలోనే ఉండే అవకాశముందని భావిస్తున్నారు. కాగా వ్యాక్సిన్ తీసుకునే సమయంలో ఇద్దరు కూడా ట్విన్నింగ్ బ్లాక్ టాప్స్ ధరించడం విశేషం.

 

Tags:    

Similar News