ఎన్‌కౌంటర్‌లో నక్సలైట్ మృతి
దిశ, భద్రాచలం: తెలంగాణకి సరిహద్దుగా ఉన్న దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ ధృవీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తల్నార్ అటవీప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (డిఆర్‌జి) బలగాలు వెళ్ళి ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో గాలిస్తుండగా.. ఎదురుపడిన నక్సల్స్ భద్రతా బలగాలపై ముందుగా కాల్పులు జరపగా.. ఆత్మరక్షణార్థం జవాన్లు […]
దిశ, భద్రాచలం: తెలంగాణకి సరిహద్దుగా ఉన్న దంతెవాడ జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక నక్సలైట్ మృతి చెందారు. ఈ ఎన్‌కౌంటర్‌ని దంతెవాడ ఎస్‌పి అభిషేక్ పల్లవ ధృవీకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. ముస్తల్నార్ అటవీప్రాంతంలో నక్సల్స్ కదలికలు ఉన్నట్లుగా అందిన విశ్వసనీయ సమాచారం మేరకు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డు (డిఆర్‌జి) బలగాలు వెళ్ళి ఉదయం సుమారు 7.30 గంటల సమయంలో గాలిస్తుండగా.. ఎదురుపడిన నక్సల్స్ భద్రతా బలగాలపై ముందుగా కాల్పులు జరపగా.. ఆత్మరక్షణార్థం జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. దాదాపు అరగంటపాటు ఇరుపక్షాల నడుమ కాల్పులు జరిగాయి. భద్రతా బలగాల ధాటికి తట్టుకోలేక నక్సల్స్ మెల్లమెల్లగా దట్టమైన అడవిలోకి తప్పించుకొని పారిపోయారని ఎస్‌పి తెలిపారు.
కాల్పులు ఆగిన అనంతరం ఆ ప్రాంతంలో వెదికిన భద్రతా బలగాలు ఒక నక్సలైట్ మృతదేహాం, ఒక స్వదేశీ ఆయుధం, గుళికలు, 2 కిలోల ఐఈడీ, ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన నక్సలైట్ జనమిలీషియా సభ్యురాలు మచంద్ర కదతిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్ నుంచి తప్పించుకున్న నక్సల్స్ కోసం ఆ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నట్లు ఎస్‌పి తెలిపారు.