కులవివక్షకు గురవుతున్న నవాజుద్దీన్ సిద్దిఖీ!
దిశ, వెబ్‌డెస్క్ : నటులు చాలా మంది ఉంటారు. కానీ తాము పోషించిన పాత్రకు ప్రాణం పోసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. విలక్షణమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు హాలీవుడ్‌లోనూ తనదైన నటనతో మెప్పించాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెర్సటైల్ యాక్టర్.. ఇప్పటికీ కుల వివక్ష ఎదుర్కొంటున్నాడు. ఇది ఎవరో చెప్పింది కాదు.. […]
దిశ, వెబ్‌డెస్క్ :
నటులు చాలా మంది ఉంటారు. కానీ తాము పోషించిన పాత్రకు ప్రాణం పోసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి నటుల్లో నవాజుద్దీన్ సిద్దిఖీ ఒకరు. విలక్షణమైన నటనతో, వైవిధ్యమైన పాత్రలతో బాలీవుడ్‌లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఈ నటుడు హాలీవుడ్‌లోనూ తనదైన నటనతో మెప్పించాడు. కాగా, ఉత్తరప్రదేశ్‌లోని ఓ పల్లెటూరు నుంచి వచ్చిన ఈ వెర్సటైల్ యాక్టర్.. ఇప్పటికీ కుల వివక్ష ఎదుర్కొంటున్నాడు. ఇది ఎవరో చెప్పింది కాదు.. స్వయంగా నవాజుద్దిన్ సిద్ధిఖే తన స్వగ్రామంలో ఇప్పటికీ కుల వివక్షకు గురవుతున్నానని చెప్పుకొచ్చాడు.
వెండితెరపై ఎంతో ఎత్తుకు ఎదిగి, కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నా.. ఎన్నో అవార్డులు వరించినా.. ఎంతోమంది తనకు రెడ్ కార్పెట్ పరుస్తున్నా.. తన సొంత ఊరిలో మాత్రం నవాజుద్దీన్ కుల వివక్షకు గురవుతున్నాడు. తన పేరు ప్రఖ్యాతలు, నటన ఇవేవీ వారి ఊరి జనాలకు పట్టడం లేదు. కేవలం కులమే గుర్తింపుగా బతుకుతుండటం నిజంగా శోచనీయం. ఇక లాక్‌డౌన్ కారణంగా గత కొన్ని నెలలుగా సిద్దిఖీ తన స్వగ్రామంలోనే గడిపాడు.
‘నేను నటనతో ఫేమస్ అయినప్పటికీ మా గ్రామంలో నన్ను ఇంకా తక్కువ కులం వాడిలాగే చూస్తారు. కులం అనేది వారి నరనరాల్లో పాకి ఉంది. అది వారు గర్వంగా చెప్పుకుంటారు. మా అమ్మమ్మ తక్కువ కులానికి చెందిన వ్యక్తి కాబట్టి మమ్మల్ని ఎప్పటికీ వారు అంగీకరించరు. ఇప్పటికీ కులవివక్ష ఉండటం, మమ్మల్ని కులహీనులుగా చూడటం చాలా కష్టంగా ఉంది’ అని సిద్దిఖీ పేర్కొన్నాడు. నవాజుద్దీన్ యూపీ, ముజఫర్‌నగర్, బుదానాలో జన్మించాడు.
ఇక నవాజుద్దీన్ కెరీర్ విషయానికి వస్తే.. సుధీర్ మిశ్రా దర్శకత్వంలో ‘సీరియస్ మెన్’ సినిమా చేశాడు. అది ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యింది. ఈ సినిమాలో సిద్దిఖీ ఒక దళితుని పాత్రలో నటించాడు. మనూ జోసెఫ్ రచించిన ‘సీరియస్ మెన్’ పుస్తకం ఆధారంగా ఈ సినిమా తీయడం విశేషం.