తల్లిపై నెటిజన్ కామెంట్.. బిగ్ బీ మనవరాలి ఎపిక్ రిప్లై

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నంద.. తన తల్లి శ్వేతాబచ్చన్ నంద గురించి ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్ట్రాంగ్ వర్కింగ్ ఉమెన్ చుట్టూ పెరగడం’ గురించి శ్వేత మాట్లాడగా.. దీనిపై ట్రోల్స్ వచ్చాయి. ‘వర్కింగ్ ఉమెన్ అంటే ఇప్పుడు నీ తల్లి శ్వేతాబచ్చన్ ఏం చేస్తుంది’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు. ‘నవ్య తల్లి బతికేందుకు ఎలాంటి పనులు చేస్తుందో’ అని […]

Update: 2021-02-17 03:36 GMT

దిశ, సినిమా : బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాలు నవ్యా నవేలి నంద.. తన తల్లి శ్వేతాబచ్చన్ నంద గురించి ట్రోల్ చేసిన వారికి గట్టి సమాధానం ఇచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘స్ట్రాంగ్ వర్కింగ్ ఉమెన్ చుట్టూ పెరగడం’ గురించి శ్వేత మాట్లాడగా.. దీనిపై ట్రోల్స్ వచ్చాయి. ‘వర్కింగ్ ఉమెన్ అంటే ఇప్పుడు నీ తల్లి శ్వేతాబచ్చన్ ఏం చేస్తుంది’ అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.

‘నవ్య తల్లి బతికేందుకు ఎలాంటి పనులు చేస్తుందో’ అని ఊహించుకోలేక పోతున్నానన్న ఓ కామెంట్‌పై స్పందించిన నవ్య.. తను ఒక ఆథర్, రైటర్, డిజైనర్, వైఫ్ అండ్ మదర్ అని సమాధానమిచ్చింది. తల్లిగా, భార్యగా ఉండటం ఫుల్ టైమ్ జాబ్ అని, దయచేసి గృహిణులుగా ఉన్న మహిళలను కించపరచరాదని కోరింది. ఒక తరం పెంపకంలో వారి పాత్ర చాలా కీలకమని, ఇందులో వారి సపోర్ట్‌ను ప్రశంసించాలే తప్ప చీప్‌గా మాట్లాడకూడదని సూచించింది.

Tags:    

Similar News