ఆస్తి విలువలో 90 శాతం వరకు రుణాలిస్తానంటున్న నవీ ఫిన్‌సర్వ్

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లిప్‌కార్ట్ మాజీ సీఈవో సచిన్ బన్సల్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న నవీ టెక్నాలజీస్‌లో భాగమైన నవీ ఫిన్‌సర్వ్ సరసమైన రిటైల్ గృహ రుణాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని వారికోసం నవీ యాప్ ద్వారా తక్కువ సమయంలో, ఎలాంటి ఆటంకాలు లేని, సరసమైన రిటైల్ గృహ రుణాలను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వేతన, స్వయం ఉపాధి కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని నవీ యాప్ నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 1.5 […]

Update: 2021-05-09 06:37 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఫ్లిప్‌కార్ట్ మాజీ సీఈవో సచిన్ బన్సల్ సహ-వ్యవస్థాపకుడిగా ఉన్న నవీ టెక్నాలజీస్‌లో భాగమైన నవీ ఫిన్‌సర్వ్ సరసమైన రిటైల్ గృహ రుణాలను ప్రారంభించనున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్‌లోని వారికోసం నవీ యాప్ ద్వారా తక్కువ సమయంలో, ఎలాంటి ఆటంకాలు లేని, సరసమైన రిటైల్ గృహ రుణాలను అందించనున్నట్టు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. వేతన, స్వయం ఉపాధి కలిగిన వారిని లక్ష్యంగా చేసుకుని నవీ యాప్ నుంచి రూ. 10 లక్షల నుంచి రూ. 1.5 కోట్ల వరకు గృహ రుణాలను పొందవచ్చు. 25 సంవత్సరాల కాలపరిమితితో 6.95 శాతం ప్రారంభ వడ్డీకే గృహ రుణాలు అందించనున్నట్టు కంపెనీ తెలిపింది.

నవీ ఫిన్‌సర్వ్ సంస్థ ఆర్‌బీఐ నమోదిత నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ అని సంస్థ వివరించింది. కరోనా సెకెండ్ వేవ్ ప్రభావంతో చాలామంది అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో నవీ ఫిన్‌సర్వ్ హైదరాబాద్‌లో వీలైనంత తొందరగా కార్యాలయాన్ని, గృహ రుణాల నెట్‌వర్క్‌ను సులభతరం చేసేందుకు 15 మంది సభ్యులను నియమించనున్నట్టు పేర్కొంది. అర్హత కలిగిన వినియోగదారులు ఆస్తి విలువలో 90 శాతం వరకు తమ యాప్ ద్వారా రుణాలను పొందవచ్చని కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News