రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రత: కేంద్ర హోం శాఖ నిర్ణయం

లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించింది.

Update: 2024-04-09 08:55 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్ సభ ఎన్నికలు జరగనున్న వేళ కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్‌కు జెడ్ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజీవ్‌కు ప్రమాదం పొంచి ఉందని ఇంటలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. దీని ప్రకారం..ఆయనకు సెంట్రల్ రిజర్వ్‌డ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్)కు చెందిన 40 నుంచి 45మంది సిబ్బంది భద్రతగా ఉంటారు. ఆయన దేశ వ్యాప్తంగా ఏ పర్యటనకు వెళ్లినా వీరంతా అందుబాటులో ఉంటారు. అలాగే నిరంతరం ఆయన వెంటన ఆరుగురు గన్ మెన్లు, ఇంటి వద్ద ఇద్దరు సిబ్బంది సెక్యురిటీగా ఉండనన్నారు. కాగా, ఏప్రిల్ 19న దేశంలో తొలిదశ సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే సెక్యురిటీ కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, రాజీవ్ కుమార్ 1984 బ్యాచ్ కి చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. 2022 మే 15న సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు.

Tags:    

Similar News