Nargis Fakhri's sister: డబుల్ మర్డర్ కేసులో నటి నర్గీస్ ఫక్రి సోదరి అరెస్టు
బీటౌన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri) సోదరి అలియా డబుల్ మర్డర్ కేసులో అమెరికాలో అరెస్టయ్యింది.
దిశ, నేషనల్ బ్యూరో: బీటౌన్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ(Nargis Fakhri) సోదరి అలియా డబుల్ మర్డర్ కేసులో అమెరికాలో అరెస్టయ్యింది. జంట హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఆమెను న్యూయార్క్(New York) పోలీసులు అరెస్టు (Nargis Fakhri's sister Arrested) చేశారు. గత నెల మాజీ ప్రియుడు, అతడి స్నేహితురాలిని అలియా సజీవదహనం చేసినట్లు ఆరోపణలున్నాయి. న్యూయార్క్‌లో ఉంటున్న అలియా ఫక్రీ కొంతకాలం పాటు ఎడ్వర్డ్ జాకోబ్ అనే యువకుడితో డేటింగ్‌లో ఉంది. వీరి మధ్య మనస్పర్థలు రావడంతో ఏడాది క్రితం విడిపోయారు. ఆ తర్వాత జాకోబ్‌కు అనాస్టాసియా ఎటినీ అనే యువతితో పరిచయమైంది. వీరిద్దరూ సన్నిహితంగా ఉంటున్నట్లు తెలుసుకున్న అలియా చాలాసార్లు తన మాజీ ప్రియుడిపై బెదిరింపులకు పాల్పడింది. ఈ క్రమంలోనే నవంబరు 2న జాకోబ్, ఆయన స్నేహితురాలు ఉంటున్న రెండంతస్తుల బిల్డింగ్ దగ్గరకు వెళ్లి నిప్పంటించింది. ఆ తర్వాత "మీరంతా ఈరోజు చనిపోతారు" అని అరిచారు. అలియా గొంతు విన్న పలువురు భవనం మంటల్లో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, వెంటనే అప్రమత్తమైన స్థానికులు భవనంలోని వారిని అప్రమత్తం చేశారు. భవనంలోని వారందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, ఘటన జరిగిన సమయంలో జాకోబ్ నిద్రిస్తున్నాడు. తొలుత ఎటినీ సురక్షితంగా బయటకు రాగా.. జాకోబ్ ని రక్షించేందుకు తిరిగి బిల్డింగ్ లోకి వెళ్లారు. దీంతో, ఇద్దరూ సజీవదహనమయ్యారు.
పోలీసుల రిమాండులోనే..
ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. అలియా ఫక్రీని అరెస్టు చేశారు. ఈ కేసులో ఆమె దోషిగా తేలితే జీవితఖైదు పడే ఛాన్స్ ఉంది. కాగా.. ప్రస్తుతం అలియాను రిమాండ్ కు తరలించారు. తదుపరి విచారణను డిసెంబర్ 9కి వాయిదా వేశారు. అయితే, సోదరి అరెస్టుపై నర్గీస్ ఫక్రీ (Nargis Fakhri) ఇంకా స్పందించలేదు. వారి తల్లి మాత్రం ఈ ఘటనను జీర్ణించుకోలేకపోయారు. అలియా అందరి పట్ల కేరింగ్ చూపించే వ్యక్తి అని ఇతరులకు సాయం చేసే గుణం కలది ఇని చెప్పారు.