Tomiko Ithoka : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ మృతి

ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ(The oldest woman) శనివారం కన్నుమూసింది.

Update: 2025-01-04 10:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ మహిళ(The oldest woman) శనివారం కన్నుమూసింది. జపాన్(Japan) కు చెందిన టొమికో ఇతోకా(Tomiko Ithoka)(116) అనారోగ్య కారణాలతో మరణించారు. గిన్నీస్ రికార్డుల ప్రకారం ప్రపంచంలో అత్యంత వృద్దురాలుగా ఇతోకా నిలిచింది. అయితే ఇతోకా కంటే ఏడాది ఎక్కువ వయసున్న స్పెయిన్(Spain) కు చెందిన బ్రన్యాస్(Branyas)(117) ప్రపంచంలో ఎక్కువ వయసున్న మహిళగా పేరు పొందగా.. బ్రన్యాస్ గత ఏడాది మరణించింది. దీంతో ప్రస్తుతం ఇతోకా అత్యంత వృద్ధ మహిళగా కొనసాగుతోంది. కాగా పలు అనారోగ్య కారణాలతో ఇతోకా మరణించినట్టు కుటుంబసభ్యులు మీడియాకు తెలియ జేశారు. ఇతోకా మరణానికి అక్కడి ప్రభుత్వం సంతాపం ప్రకటించింది. అయితే సాధారణంగానే జపాన్ లో అత్యధిక వయసున్న వృద్ధుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో అత్యధిక వృద్ధులు కలిగిన దేశంగా జపాన్ నిలిచింది.   

Tags:    

Similar News