Henley Passport Index: శక్తిమంతమైన పాస్ పోర్టు జాబితాలో భారత్ ది ఎన్నో స్థానమంటే?

ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ (Passports) కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌(Henley Passport Index) అనే సంస్థ విడుదల చేసింది.

Update: 2024-07-24 05:32 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే శక్తిమంతమైన పాస్‌పోర్ట్‌ (Passports) కలిగిన దేశాల జాబితాను హెన్లీ పాస్‌పోర్ట్‌ ఇండెక్స్‌(Henley Passport Index) అనే సంస్థ విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్ 82వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే భారత్ మూడు స్థానాలు మెరుగుపడింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్టు అసోసియేషన్ (IATA) నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ జాబితాను రూపొందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో రిలీజ్ చేసిన ర్యాంకింగ్స్ లో భారత్ కు 85వ స్థానంలో ఉండటం గమనార్హం. భారత్(India) తో పాటుగా సెనెగెల్‌, తజకిస్థాన్‌ దేశాలు 82వ స్థానంలో ఉన్నాయి. ఇండియన్ పాస్ పోర్టుతో ఇండోనేషియా, మలేషియా, థాయ్ లాండ్ వంటి ప్రపంచంలోని 58 దేశాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. గతంలో ఈ సంఖ్య 59 ఉండగా.. ఇప్పుడు అది 58కి మారింది.

అగ్రస్థానం ఏ దేశమంటే?

ఇక, ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్టుల జాబితాలో సింగపూర్‌ (Singapore) అగ్ర స్థానంలో నిలిచింది. ఆ దేశ పాస్‌పోర్ట్‌తో 195 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఫ్రాన్స్‌, ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌, జపాన్‌ సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్ట్‌లతో 192 దేశాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. ఆ తర్వాత ఆస్ట్రియా, ఫిన్‌లాండ్‌, ఐర్లాండ్‌, లగ్జెంబర్గ్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, స్వీడన్‌ పాస్‌పోర్టులు మూడో స్థానంలో ఉన్నాయి. 191 దేశాలుక వీసా లేకుండా వెళ్లొచ్చు. అమెరికా 8 వ స్థానంలో ఉంది. ఆ వీసాతో 186 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఇక పాక్ వందో స్థానంలో ఉంది. ఆ పాస్ పోర్టుతో 33 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు. చివరి స్థానం 103లో అఫ్గాన్ ఉంది. ఆ పాస్ పోర్టుతో 26 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.


Similar News