షాకింగ్.. ఆంటీ అని పిలిచినందుకు బస్సు కండక్టర్‌పై కేసు పెట్టిన మహిళ
ఆంటీ అని పిలిచినందుకు బస్సు కండక్టర్‌పై ఒక మహిళ కేసు పెట్టింది.
దిశ, వెబ్‌డెస్క్: ఆంటీ అని పిలిచినందుకు బస్సు కండక్టర్‌పై ఒక మహిళ కేసు పెట్టింది. అలా పిలిచి తనను అమమానించాడంటూ భర్తతో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు.. కండక్టర్‌పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ఈ షాకింగ్ సంఘటన తమిళనాడులోని చెన్నైలో చోటుచేసుకుంది.
చెన్నైకు చెందిన నిర్మలాదేవి(57) అనే మహిళ బుధవారం మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించింది. ఈ సందర్బంగా టికెట్ ఇచ్చేందుకు మహిళ దగ్గరకు వచ్చిన బస్సు కండక్టర్.. టికెట్ ఎక్కడికి ఆంటీ అని అడిగాడు. దీంతో కండక్టర్‌పై మహిళ విరుచుకుపడింది. తనను ఆంటీ అంటావా అంటూ సీరియస్ అయింది. దీంతో బస్సులో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
వాగ్వాదం మరింత పెరగడంతో తన భర్తకు మహిళ ఫోన్ చేసి పిలిచింది. రెడ్ హిల్స్ దగ్గరకు రావాలని భర్తకు చెప్పింది. భర్త ఆఘమేఘాల మీద చేరుకోగా.. బస్సు దిగిన అనంతరం రెడ్ హిల్స్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని కండక్టర్‌పై మహిళ ఫిర్యాదు చేవారు. తనను ఆంటీ అని పిలిచి అవమానించాడని, కేసు నుమోదు చేయాలని ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.