Gold Gift: బరువు తగ్గితే బంగారం ఇస్తారా! ఎక్కడంటే?

ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు.

Update: 2025-03-16 05:11 GMT
Gold Gift: బరువు తగ్గితే బంగారం ఇస్తారా! ఎక్కడంటే?
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుత రోజుల్లో చాలా మంది బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారు ఇప్పుడు చెప్పబోయే వార్త ఎగిరి గంతేస్తారు. ఎందుకంటే.. బరువు తగ్గితే ప్రభుత్వం బంగారాన్ని బహుమతిగా అందిస్తుంది. బంపరాఫర్ కదా.. అయితే, ఇది మన దేశంలో కాదు. ఎక్కడో తెలుసుకోవాలనుకుంటున్నారా?

దుబాయ్ జనాభాలో ఊబకాయం ఒక ప్రధాన సమస్యగా ఉంది. అక్కడ జనాభాలో దాదాపు 17.8% మందిలో ఊబకాయం, 39.8% మంది అధిక బరువుతో ఉన్నారు. ముఖ్యంగా మహిళలలో (21.6%) ఊబకాయం రేటు పురుషుల కంటే అధికంగా ఉంది. ఇక ఊబకాయం కారణంగా అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బులు, స్ట్రోక్, ఆర్థరైటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఈ క్రమంలో ప్రజల ఊబకాయాన్ని తగ్గించడానికి అక్కడి ప్రభుత్వం నడుంబిగించింది. ప్రజల్లో ఊబకాయం, బరువు తగ్గటంపై అవగాహన కల్పించేందుకు ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా బరువు తగ్గిన వారికి బంగారాన్ని బహుమతిగా అందిస్తుంది. ఇది ప్రజలు ఆరోగ్యకరమైన జీవన శైలికి అలవాటు పడేందుకు సాయపడుతుందని పేర్కొంది. నిర్ధిష్ట సమయంలో వ్యాయామం, డైట్ ద్వారా బరువు తగ్గి ఫిట్‌గా తయారైతే.. బంగారాన్ని ప్రైజ్‌గా ఇస్తామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. రెండు కిలోల బరువు తగ్గితే రెండు గ్రాముల బంగారాన్ని అందజేస్తుంది. 2013లో ప్రవేశపెట్టిన ఈ స్కీం.. ప్రస్తుతం వైరల్‌గా మారింది.


Read More..

వామ్మో.. ఏంటీ అరాచకం.. రూ.90 వేలకు చేరువలో బంగారం ధర  

petrol diesel prices: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే..?  

Tags:    

Similar News