ఎప్పుడూ ‘వైట్ టీషర్టే’ ఎందుకు ధరిస్తారు?: రాహుల్ ఆసక్తికర సమాధానం
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ వైట్ టీ షర్ట్ ధరిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఎప్పుడూ తెల్లటి టీషర్టే ఎందుకు ధరిస్తారు? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు.
దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతాడు. దేశ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా ఎల్లప్పుడూ వైట్ టీ షర్ట్ ధరిస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలోనే రాహుల్ ఎప్పుడూ తెల్లటి టీషర్టే ఎందుకు ధరిస్తారు? అనే ప్రశ్నకు ఆయన ఆసక్తికర సమాధానం ఇచ్చారు. తెలుపు పారద్శకత, నిరాడంబరతను చాటుతుందని తెలిపారు. నేను బట్టల గురించి ఎక్కువగా పట్టించుకోనని, సింపుల్‌గా ఉండేందుకే ఇష్టపడతానని చెప్పారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యల మధ్య జరిగిన రాపిడ్ ఫైర్ సంభాషణను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. ఇందులో భాగంగా రాహుల్ ఖర్గే, సిద్ధరామయ్యలను ఇంటర్వ్యూ చేశారు.
ప్రచారంలో ఏది మంచి, ఏది చెడు అని ఖర్గేను ప్రశ్నించగా..చెడు ఏమీ లేదని, దేశాన్ని నాశనం చేసే వ్యక్తిని ఆపడానికి పోరాటం చేస్తున్నాం కాబట్టి అంతా మంచేనని తెలిపారు. ‘అధికారం వస్తుంది పోతుంది. కానీ భావజాలానికి కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం’ అని చెప్పారు. ఇదే ప్రశ్నను సిద్ధరామయ్యను అడగగా..ఎల్లప్పుడూ భావజాలమే ముఖ్యమని వెల్లడించారు. పార్టీ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల ముందుంచాలని చెప్పారు. అప్పుడు మాత్రమే ప్రజలు తమను ఆశీర్వదిస్తారని స్పష్టం చేశారు. అనంతరం కలుగజేసుకున్న రాహుల్ ఖర్గే, సిద్ధరామయ్యలతో ఏకీభవిస్తున్నట్టు తెలిపారు. భావజాలంపై స్పష్టమైన అవగాహన లేకుండా అధికారం వైపు వెళ్లలేరని చెప్పారు.