Mehbooba Mufti : ఆ పార్టీ అధికారంలోకి వస్తేనే.. ఎన్నికలను హలాల్ అంటుంది: మెహబూబా ముఫ్తీ

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు.

Update: 2024-08-30 14:46 GMT

దిశ, నేషనల్ బ్యూరో : నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీపై పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విమర్శలు గుప్పించారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఎన్నికలను హలాల్ అనడం, అధికారాన్ని కోల్పోయినప్పుడు ఎన్నికలను హరామ్ అనడం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లాకు అలవాటైపోయిందని ఆమె ఎద్దేవా చేశారు. కశ్మీర్‌లో మరో రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం అనేది నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీకి ఇష్టం లేదన్నారు.

జమాతే ఇస్లామీ పార్టీకి కూడా కశ్మీర్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు. 1987లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జమాతే ఇస్లామీ పోటీ చేసినప్పుడు నాటి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందన్నారు.


Similar News