పాకిస్థాన్ గాజులు తొడుక్కుని ఏం లేదు: రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలపై ఫరూక్ అబ్దుల్లా కౌంటర్

పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు.

Update: 2024-05-06 06:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)ను భారత్‌లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా స్పందించారు. పాకిస్థాన్ గాజులు తొడుక్కుని ఏం లేదని, వారి వద్ద అణుబాంబులు కూడా ఉన్నాయని తెలిపారు. భారత్ మీద అణుబాంబులు వేస్తే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఒక వేళ రాజ్ నాథ్ ఆ ప్రయత్నంలో ఉంటే ముందకు సాగొచ్చని, దానిని ఆపేందుకు మేమెవరిమని తెలిపారు. కానీ పాక్ వద్ద అణుబాంబులు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. కాగా, ఇటీవల ఓ కార్యక్రమంలో భాగంగా రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధిని పరిగణనలోకి తీసుకుంటే పీఏకే ప్రజలు తాము భారత్‌లో ఉండాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. కాబట్టి పీఓకేను బలవంతంగా భారత్‌లో కలపాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

Tags:    

Similar News