Smriti Irani: రాహుల్ గాంధీపై స్మృతి ఇరానీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani) సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-08-29 09:48 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్‌ నేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)పై కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకురాలు స్మృతి ఇరానీ (Smriti Irani) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్‌ తన గెలుపును ఎంజాయ్‌ చేస్తున్నారని అన్నారు. రాజకీయంగా ఆయన పరిణితి చెందారని అన్నారు. ఆయన ప్రవర్తనలో మార్పు (changed politics) కనిపిస్తోందన్నారు. ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె రాహుల్ గురించి మాట్లాడారు. ‘రాహుల్‌ తన గెలుపును ఎంజాయ్‌ చేస్తున్నారు. రాజకీయంగా ఆయనలో మార్పు వచ్చింది. ఆయన ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. కొత్త రాజకీయ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఎంతో పరిణితితో మాట్లాడుతున్నారు. గత ఎన్నికల్లో రాహుల్‌ దేవాలయాలను సందర్శించడం ద్వారా దేశంలోని ఓటర్లను (ప్రధానంగా హిందువులను) ఆకర్షించేందుకు ప్రయత్నించారు. కానీ అది జరగలేదు. అతను ఓ గొప్ప రాజకీయ నాయకుడి మనస్తత్వాన్ని కలిగి ఉంటే.. అది అతని కెరీర్‌ ప్రారంభం నుంచే స్పష్టంగా కనిపించేది. అతను ఇప్పుడు చేస్తున్నది కేవలం ఓ స్ట్రాటజీ మాత్రమే’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం స్మృతి ఇరానీ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి.


Similar News