ప్రతిపక్షాలు విమర్శించడం తప్ప ఏం చేయగలవు: నిర్మలా సీతారామన్

బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2024-04-14 13:27 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ మీడియాతో మాట్లాడిన ఆమె "విక్షిత్ భారత్ 2047" మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలు దేశ ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగపర్చాలనే ఉద్దేశ్యాన్ని కలిగి ఉన్నాయని అన్నారు. నిరుపేదలకు సాధికారత కల్పించడం, సమాజంలోని అట్టడుగు వర్గాలకు, ప్రత్యేకించి రైతులను ఆదుకునే లక్ష్యంతో సంక్షేమ పథకాల పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. అవినీతికి వ్యతిరేకంగా తాము కట్టుబడి ఉన్నాము. ప్రతిపక్షాలు మాపై విమర్శలు చేయడం తప్ప ఏం చేయగలవు అని అన్నారు. తమిళనాడులో రాజకీయ పరిస్థితుల గురించి వ్యాఖ్యానిస్తూ, రాష్ట్రంలో అధికార వ్యతిరేకత ఉంది. అధికార పార్టీ డ్రగ్స్ డీలర్స్‌తో సంబంధాలు కలిగి ఉంది. వారు కలిసి సినిమాలు నిర్మిస్తున్నారని ఆరోపించారు. విక్షిత్ భారత్ 2047 కి అనుగుణంగా మేనిఫెస్టోలో అన్ని అంశాలు ఉన్నాయి. వీటి అమలకు కట్టుబడి ఉన్నామని నిర్మలా సీతారామన్ అన్నారు.


Similar News