నిక్కీ యాదవ్ మర్డర్ కేసు: వెలుగులోకి సంచలన నిజాలు

దేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ దారుణంగా హత్య చేశాడు.

Update: 2023-02-16 12:48 GMT

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమెను ఫ్రిడ్జ్ లో దాచి అదే రోజు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనకు సంబంధించి నిందితుడు సాహిల్ ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని విచారించగా.. సాహిల్ సంచలన నిజాలు చెప్పాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిక్కీని డేటా కేబుల్ తో గొంతు నులిమి చంపక ముందు సాహిల్ తన ఫ్రెండ్స్ తో కలిసి ఎంగేజ్ మెంట్ పార్టీ చేసుకున్నానని సాహిల్ చెప్పాడు.

ప్రియురాలు నిక్కీని పెళ్లి చేసుకోవాలా లేక తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాదేశ రాజధాని ఢిల్లీలో నిక్కీ యాదవ్ అనే యువతిని ఆమె ప్రియుడు సాహిల్ గెహ్లాట్ దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఆమెను ఫ్రిడ్జ్ లో దాచి అదే రోజు వేరే అమ్మాయితో ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తాజాగా ఈ ఘటనకు సంబంధిం అర్థం కాలేదని, కానీ తన అమ్మనాన్నలు చూసిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకున్నట్లు నిందితుడు తెలిపాడు. అనంతరం ఢిల్లీలోని ఉత్తమ్ నగర్ లోని ఆమె ఫ్లాట్ కు వెళ్లానని, ఆ రోజు ఆమెతో అక్కడే ఉన్నానని సాహిల్ చెప్పాడు. ఈ క్రమంలోనే గోవాకు వెళ్తామని నిక్కీ సాహిల్ కు చెప్పగా.. సాహిల్ కు ఫ్లైట్ టికెట్ బుక్ కావడంతో ఈ ప్లాన్ ను రద్దు చేసుకున్నారు. అనంతరం ఇద్దరు కలిసి బస్సులో హిమాచల్ ప్రదేశ్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

అందుకోసం నిజాముద్దీన్ రైల్వే స్టేషన్, ఆనంద్ విహార్ బస్సు స్టేషన్ కు వెళ్లారు. అక్కడ సంబంధిత ట్రైన్, బస్సు వెళ్లిపోవడంతో నిక్కీ, సాహిల్ అక్కడి నుంచి కారులో తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలోనే సాహిల్ తన ఎంగేజ్ మెంట్ గురించి నిక్కీకి చెప్పగా నిక్కీ గొడవ చేసింది. తనను కాదని వేరే అమ్మాయిని ఎలా పెళ్లి చేసుకుంటావని నిలదీసింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన సాహిల్ డేటా కేబుల్ తో నిక్కీ గొంతు నులిమి చంపేశాడు. అనంతరం 45 కిలో మీటర్లు కారులో ప్రయాణించి సౌత్ వెస్ట్ ఢిల్లీలోని మిథ్రాన్ గ్రామంలో ఉన్న తమ హోటల్ ఫ్రిడ్జ్ లో నిక్కీ శవాన్ని దాచాడు.  

Tags:    

Similar News