Weddings Cost: దేశంలో పెరిగిన పెళ్లిళ్ల ఖర్చు.. సగటన ఒక్కో వివాహానికి రూ. 36.50 లక్షలు..!

భారతదేశంలో వివాహాల ఖర్చు(Weddings Cost) ఏటా భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ వెడ్‌మీగుడ్‌(WedMeGood) తెలిపింది.

Update: 2024-12-01 15:02 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో వివాహాల ఖర్చు(Weddings Cost)  ఏటా భారీగా పెరిగిపోతోందని ప్రముఖ వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ వెడ్‌మీగుడ్‌(WedMeGood) తెలిపింది. దేశంలో ఈ ఏడాది పెళ్లిళ్ల కోసం ఏకంగా రూ. 36.5 లక్షల కోట్లు ఖర్చు చేశారని ఆ సంస్థ విడుదల చేసిన వార్షిక సర్వే రిపోర్టు(Annual Survey Report)లో వెల్లడించింది. గతేడాది ఇదే సమయంలో జరిగిన పెళ్లిళ్ల ఖర్చుతో పోలిస్తే ఈ సారి 7 శాతం ఎక్కువ ఖర్చు చేశారని పేర్కొంది. అలాగే యావరేజ్(Average)గా ఒక్కో వివాహానికి రూ.36.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇక డెస్టినేషన్ వెడ్డింగ్(Destination Wedding) బడ్జెట్ రూ. 51.1 లక్షలుగా ఉందని తెలిపింది. కాగా 2022లో ఓ పెళ్లి బడ్జెట్ సగటున రూ. 25 లక్షలు ఉండగా.. 2024లో ఆ మొత్తం రూ. 36.50 లక్షలకు పెరిగినట్లు తెలిపింది. ప్రతి ఐదు పెళ్లిల్లో ఓ వివాహ ఖర్చు రూ. 50 లక్షలకు పైనే ఉంటోందని చెప్పింది. ఈ సంవత్సరం ఆతిథ్యం(Hospitality), విందు(Dinner) ఖర్చు భారీగా పెరగడమే పెళ్లిళ్ల వ్యయం పెరగడానికి కారణమని తెలిపింది. కాగా ఈ సర్వేలో మొత్తం 3,500 జంటల అభిప్రాయాన్ని తీసుకున్నారు. 

Tags:    

Similar News