రాజ్యాంగంపై దాడిని అనుమతించబోము: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు నిరంతరం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, దీనిని ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.

Update: 2024-06-24 08:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలు నిరంతరం రాజ్యాంగంపై దాడి చేస్తున్నారని, దీనిని ఇండియా కూటమి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం ఆయన పార్లమెంటు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంపై దాడిని అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రతిపక్షాల సందేశం ప్రజలకు చేరుతోందా అని అడిగిన ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ..మా సందేశం ప్రజలకు చేరుతోందని తెలిపారు. భారత రాజ్యాంగాన్ని ఏ శక్తి నిర్వీర్యం చేయలేదని తేల్చి చెప్పారు. ‘రాజ్యాంగంపై మోడీ, అమిత్ షా చేస్తున్న దాడి మాకు ఆమోదయోగ్యం కాదు. ఇది జరగనివ్వబోము. కాబట్టి మేము ప్రమాణం చేస్తున్నప్పుడు రాజ్యాంగ నిబంధనలు అనుసరించాం’ అని చెప్పారు. కాగా, 18వ లోక్‌సభ మొదటి సెషన్‌ సందర్భంగా ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంటు ప్రాంగణంలో నిరసన తెలిపారు. రాజ్యాంగ ప్రతిని చేతపట్టుకుని రాజ్యాంగాన్ని రక్షించాలని నినాదాలు చేశారు.


Similar News