రాహుల్ గాంధీని బలవంతం చేస్తాం: Mallikarjun Kharge
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస సవాళ్లు ఎదుర్కొంటోంది. కీలక నేతలు అనేకమంది పార్టీ సభ్యత్వానికి..
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం వరుస సవాళ్లు ఎదుర్కొంటోంది. కీలక నేతలు అనేకమంది పార్టీ సభ్యత్వానికి, పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. వీటితో పాటుగా కాంగ్రెస్ పార్టీ తదుపరి అధ్యక్షుడు ఎవరన్న విషయం పార్టీ శ్రేణుల్లో హాట్ టాపిక్‌గా ఉంది. తాజాగా పార్టీ అధ్యక్షుడు ఎవరు విషయంపై సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని ముందుకు నడపాలనుకునే వారు తప్పకుండా దేశమంతా తెలిసి ఉండాలని, వారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, పశ్చిమ బెంగాల్ నుంచి గుజరాత్ వరకు అంతే సపోర్ట్ అందుకోవాలని మల్లికార్జున్ అన్నారు.
'పార్టీ తదుపరి అధ్యక్షుడికి పార్టీ అంతా గుర్తింపు కలిగి ఉండాలి. అంతేకాకుండా పార్టీ అంతా కూడా వారిని ఒప్పుకోవాలి. కానీ ప్రస్తుతం పార్టీలో అలాంటి వారెవరూ లేరు' అని ఆయన అన్నారు. అంతేకాకుండా అందుకు రాహుల్ గాంధీనే సరైన వ్యక్తి అని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'పార్టీలో రాహుల్ గాంధీ కాకుండా వేరే వారు ఎవరైనా సరైన నేత ఉంటే చెప్పండి. ఒకవేళ రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి అందుకునేందుకు విముఖత చూపిస్తే. పార్టీ కోసం, దేశం కోసం, ఆర్ఎస్ఎస్-బీజేపీతో పోరాడేందుకు, దేశాన్ని ఏకం చేసేందుకు రాహుల్ గాంధీని అధ్యక్ష పదవి అందుకునేందుకు రిక్వెస్ట్ చేస్తాం. బలవంతం చేస్తాం. మేమంతా అతడి వెనక ఉంటాం. అతడిని అనుసరిస్తాం' అని ఖర్గే చెప్పుకొచ్చారు.
Also Read : ఆలేరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేయాలి..