Kangana : మేం పీవోకేను కలుపుకోవాలనుకుంటున్నాం : కంగనా

సినీ నటి, బీజేపీ(BJP) మండి ఎంపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana) తరుచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాంటారు.

Update: 2024-11-16 12:30 GMT

దిశ, వెబ్ డెస్క్ : సినీ నటి, బీజేపీ(BJP) మండి ఎంపీ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్(Kangana) తరుచూ తన వ్యాఖ్యలతో వార్తల్లో నిలుస్తాంటారు. 2021లో రద్దు చేసిన సాగు చట్టాలను మళ్లీ తీసుకురావాలంటూ ఆమె ఇటీవల చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. సొంత పార్టీ బీజేపీ అధిష్ఠానం కూడా తప్పు పట్టింది. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయవద్దంటూ ఆమెను మందలించింది. దీంతో తన వ్యాఖ్యల పట్ల క్షమాపణ చెప్పి వాటిని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్లొన్న కంగనా అంతకుముందు ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పిన 'బాటోగే తో కటోగే' నినాదంపై స్పందించారు.

యోగి వ్యాఖ్యల్లో తప్పేమి లేదని 'బాటోగే తో కటోగే' నినాదం ఐక్యతకు పిలుపు అని కంగనా స్పష్టం చేశారు. ఐక్యత బలమని మనందరికి చిన్నప్పటి నుండి నేర్పించబడిందేనని, మనం కలిసి ఉంటే, మనం సురక్షితంగా ఉంటామని, విడిపోతే బలహీన పడుతామన్నారు. మా పార్టీ సనాతనీ పార్టీ అని, దేశమంతా ఏక త్రాటిపై ఉండాలని కోరుకుంటుందని, అందరిని కలుపుకుని ముందుకెళ్లాలనుకుంటుందని, పీఓకే(పాక్ ఆక్రమిత కశ్మీర్)ను తిరిగి కలుపుకోవాలనుకుంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విభజించాలనే ప్రతిపక్షాల కుట్రలు విజయవంతంగా విఫలమవుతున్నాయని మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు.

Tags:    

Similar News