UP: మేం సాయం చేయడానికి రెడీ.. కుంభమేళా ఏర్పాట్లపై అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యలు

మహాకుంభమేళా ఏర్పాట్లపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhlesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించడంలో, ఎన్నికల ప్రణాళికల్లో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని విమర్శించారు.

Update: 2024-12-25 10:35 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మహాకుంభమేళా ఏర్పాట్లపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్(Akhlesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. డబ్బు సంపాదించడంలో, ఎన్నికల ప్రణాళికల్లో బీజేపీ నేతలు బిజీగా ఉన్నారని విమర్శించారు. అందుకే, మహాకుంభమేళా(KumbhMela)కు జరుగుతున్న ఏర్పాట్లలో పాల్గొనలేకపోతున్నారని చురకలు అంటించారు. కుంభమేళాకు దగ్గరకొస్తున్నా.. భక్తుల భద్రతకు సరైన సౌకర్యాలు కల్పించడంలో అలసత్వం వహిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి కుంభమేళాను నిర్వహించడం రాకపోతే సాయం చేయడానికి తమ పార్టీ సిద్ధంగా ఉందని అన్నారు. ఏర్పాట్లలో అధికారుల సమన్వయలోపం ఉందని.. దాంతో భద్రతాపరమైన ఏర్పాట్లు ఆలస్యమవుతున్నాయని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పనను యూపీ సర్కారు విస్మరించిందన్నారు. వారి కోసం ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదన్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. ఏర్పాట్లలో తమ పార్టీ నేతలు ప్రభుత్వానికి సహకరిస్తారన్నారు.

మహాకుంభమేళా

‘మహాదాని’ చక్రవర్తి హర్షవర్దనుడి విగ్రహం తొలగించడంలో బీజేపీ ప్రభుత్వం తొందరపడిందని.. అయితే, పరిపాలన నిర్వహణలో ఆ వేగం ఎందుకు చూపించట్లేదని అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. అంతేకాకుండా, మహాకుంభమేళా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని తాము కోరుకుంటున్నామన్నారు. కాగా.. ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళా జరగనుంది. ప్రతి 12 ఏళ్లకొకసారి నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది ప్రయాగ్ రాజ్ చేరుకుంటారు.

Tags:    

Similar News