పాక్ దివాలా తీసింది.. పాక్ రక్షణ మంత్రి ఖవాజా సంచలన వ్యాఖ్యలు

దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-02-19 10:43 GMT

ఇస్లామాబాద్: దేశంలో సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాలా తీసిందని అన్నారు. నగదు కొరతతో ఉన్న పాక్ కు అంతర్జాతీయ ద్రవ్య నిధి నుంచి సాయం విషయంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఇప్పటికే దివాళ తీసిందని, దేశంలో ఆర్థిక సంక్షోభానికి రాజకీయ నాయకులు, అధికారులే కారణమని నిందించారు. సమస్యలకు పరిష్కారం దేశంలోనే ఉందని మిస్టర్ ఆసిఫ్ అన్నారు. దేశ సమస్యలకు ఐఎంఎఫ్ వద్ద పరిష్కారం లేదని పాక్ మంత్రి అన్నారు.

తాను ఎక్కువ సమయం ప్రతిపక్ష శిబిరంలోనే గడిపానని, గత 32 ఏళ్లుగా రాజకీయాలు పరువు పోతుందని చూస్తున్నానని మంత్రి అన్నారు. గత కొన్ని రోజులుగా పాక్ దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటుంది. సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ధరల పెంపును ఆశ్రయించింది. అయితే ఐఎంఎఫ్ మాత్రం రుణం ఇచ్చే విషయంలో ఆలస్యం చేయడం పాక్ ను మరింత తీవ్ర పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది.

Tags:    

Similar News