Wayanad: వయనాడ్‌కు మరోసారి వార్నింగ్.. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ

కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండ చరియలు విరిగిపడి తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2024-08-14 12:58 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని వయనాడ్ జిల్లాలో ఇటీవల కొండ చరియలు విరిగిపడి తీవ్ర విషాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటన నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న వయనాడ్‌కు భారత వాతావరణ శాఖ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని ఎర్నాకులం, త్రిసూర్, కన్నూర్‌, కోజికోడ్, వయనాడ్‌లలో ఏడు సెంటీమీటర్ల నుంచి 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే చాన్స్ ఉందని పేర్కొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన లక్షద్వీప్‌కు రెడ్ అలర్ట్ ఇస్యూ చేసింది. రాబోయే 24 గంటల్లో 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు వయనాడ్‌లో తీవ్రమైన వర్షపాతం కారణంగానే కొండచరియలు విరిగిపడ్డాయని ప్రపంచ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. భారత్, స్వీడన్, యూఎస్, యూకేల నుంచి 24 మంది పరిశోధకులతో కూడిన బృందం ఈ వివరాలు వెల్లడించింది. ఒకే రోజులో 140 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని, దీనివల్లే విపత్తు సంభవించిందని తెలిపింది. కాగా, జూలై 30న వాయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటానికి కారణమైన భారీ వర్షపాతాన్ని అంచనా వేయడంలో ఐఎండీ విఫలమైందని కేరళ ప్రభుత్వం గతంలో ఆరోపించింది. 

Tags:    

Similar News