Waqf Board : ‘వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు’పై బీజేపీ ప్రత్యేక బృందం

దిశ, నేషనల్ బ్యూరో : ‘వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు -2024’కు సంబంధించి ముస్లింల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.

Update: 2024-09-01 12:07 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ‘వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు -2024’కు సంబంధించి ముస్లింల నుంచి సలహాలు, సూచనలను స్వీకరించేందుకు బీజేపీ మైనారిటీ ఫ్రంట్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందులోని ఏడుగురు సభ్యుల్లో.. షాదాబ్ షమ్స్ (ఉత్తరాఖండ్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్), సనావర్ పటేల్ (మధ్యప్రదేశ్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్), చౌదరీ జాకిర్ హుస్సేన్ (హర్యానా వక్ఫ్‌బోర్డు అడ్మినిస్ట్రేటర్), మొహసిన్ లోఖండ్‌వాలా (గుజరాత్ వక్ఫ్‌బోర్డు ఛైర్మన్), మౌలానా హబీబ్ హైదర్ (బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు), నాసిర్ హుస్సేన్ (బీజేపీ మైనారిటీ ఫ్రంట్ జాతీయ నిర్వాహక సభ్యుడు), రజబ్ అలీ (హిమాచల్ ప్రదేశ్ వక్ఫ్‌బోర్డు మాజీ ఛైర్మన్) ఉన్నారు.

ఈ బృందం దేశంలోని అన్ని రాష్ట్రాల ముస్లింలు, మత పెద్దల నుంచి ‘వక్ఫ్‌బోర్డు సవరణ బిల్లు -2024’పై అభిప్రాయాలను సేకరిస్తుంది. ఈ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే కలిగే ప్రయోజనాల గురించి వారికి వివరిస్తుంది. ఆ సమాచారంతో సమగ్ర నివేదికను రూపొందించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) ఛైర్మన్‌లకు సమర్పించనుంది.


Similar News