అదానీ అంశంపై నిశ్శబ్దం ఎందుకు?

రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానమంత్రికి సూటి ప్రశ్నలు వేశారు. అదానీ..."Want To Ask PM Why Are You So Quiet": M Kharge On Adani Row

Update: 2023-02-08 11:22 GMT

న్యూఢిల్లీ: రాజ్యసభ విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే ప్రధానమంత్రికి సూటి ప్రశ్నలు వేశారు. అదానీ అంశంపై మోడీ మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ప్రధాని మౌన బాబాగా వర్ణించారు. బుధవారం రాష్ట్రపతి ప్రసంగంపై రాజ్యసభలో ఆయన సమాధానమిచ్చారు. 'ప్రధాని మోడీ ఎందుకు ఇంత నిశ్శబ్దంగా ఉన్నారు. ప్రతి ఒక్కరిని భయపెట్టే మీరు.. పారిశ్రామికవేత్తలను ఎందుకు భయపెట్టలేకపోతున్నారు' అని ప్రశ్నించారు. విద్వేషాన్ని వ్యాప్తి చేసే వారిపై ప్రధాని కన్నెర్ర చేస్తే... టికెట్ రాకపోవచ్చని ఆలోచిస్తారని అన్నారు. అయితే ప్రస్తుతం ప్రధానినే నిశ్శబ్దంగా కూర్చొని మౌన బాబా అయ్యారని అన్నారు. అదానీ అంశంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ దర్యాప్తు చేపట్టాలని ఖర్గే డిమాండ్ చేశారు. అయితే ప్రధానిపై ఖర్గే వ్యాఖ్యలను రాజ్యసభ చెర్మన్ జగదీప్ ధన్కడ్ ఖండించారు. మీ స్థాయికి ఈ వ్యాఖ్యలు సరిపాటు కాదని ఖర్గేను ఉద్దేశించి అన్నారు. కొన్ని స్థానాలకు తగిన గౌరవాన్ని ఇవ్వాలని చెప్పారు. సీనియర్ నాయకుడిగా మీరు చర్చ స్థాయిని పెంచుతారని భావిస్తున్నట్లు ధన్కడ్ తెలిపారు.

Tags:    

Similar News