ప్రతి తల్లికి ఇలాంటి కొడుకు ఉండాలి.. అందరి హార్ట్ను టచ్ చేస్తున్న (వీడియో)
ఓ వ్యక్తి తన తల్లిని అమూల్యమైన బహుమతితో ఆశ్చర్యపరిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో...Viral Video: Man Surprising Mother with gold Chain
దిశ, వెబ్ డెస్క్: ఓ వ్యక్తి తన తల్లిని అమూల్యమైన బహుమతితో ఆశ్చర్యపరిచిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 40 సెకన్ల నిడివి గల ఈ క్లిప్ ను గుల్జార్ సాహబ్ అనే వ్యక్తి సోమవారం ట్విట్టర్ లో షేర్ చేశాడు. మమ్మీకి చిన్న బహుమతి అంటూ దానికి క్యాప్షన్ పెట్టాడు. వీడియోలో ఆ వ్యక్తి కొత్త బంగారం గొలుసుతో తన తల్లిని ఆశ్చపరిచాడు. ఆమె కుటుంబం కోసం ఆహారాన్ని తీయడంలో బిజీగా ఉన్నప్పుడు అతను ఆమె వెనుక నిలబడి కనిపిస్తాడు. కొద్దిసేపటి తర్వాత అతను మెల్లగా ఆమె మెడలో ఆ బంగారు గొలుసు వేస్తాడు. ఫస్ట్ కొంత కన్ఫ్యూజ్ అయిన ఆమె కొద్దిసేపటికే తనకు తన కొడుకు బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చాడని గ్రహించి ఆమె నవ్వుతూ ఆనంద పడుతున్న దృశ్యం అందులో చూడొచ్చు.
छोटा सा गिफ्ट मम्मी के लिए 👩❤️💋👨🎁💐 pic.twitter.com/WPUc7fTvRj
— ज़िन्दगी गुलज़ार है ! (@Gulzar_sahab) November 14, 2022