మణిపూర్‌లో మరోసారి హింస: కాల్పుల్లో పోలీస్ మృతి
మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావారణం నెలకొంది. బుధవారం ఉదయం కుకీ తిరుగుబాటు దారులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరోసారి ఉద్రిక్త వాతావారణం నెలకొంది. టెంగ్నోపాల్ జిల్లాలోని సరిహద్దు పట్టణం మోరెలో బుధవారం ఉదయం కుకీ తిరుగుబాటు దారులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ పోలీస్ కమాండో మృతి చెందారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మోరె పట్టణ సమీపంలోని భద్రతా కార్యాలయంపై తిరుగుబాటు దారులు బాంబులు విసరగా భద్రతా బలగాలు ఎదురు కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్‌లో గాయపడిన పోలీస్ మరణించారు. మోరేలో ఓ పోలీసు అధికారిని హత్య చేశారనే ఆరోపణలతో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసిన రెండు రోజుల తర్వాత తాజాగా హింస చోటుచేసుకుంది. కాగా, ఈశాన్య రాష్ట్రంలో కొద్ది రోజులుగా అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.